మౌంట్ కాంగ్ యాట్సే 2 పర్వతాన్ని అధిరోహించిన మహబూబాబాద్ యువకుడు - Mountaineer Bhukya Yashwanth - MOUNTAINEER BHUKYA YASHWANTH
🎬 Watch Now: Feature Video
Published : Jul 17, 2024, 2:06 PM IST
Bhukya Yashwanth Climbs Mount Kang Yatse-2 Mountain in Ladakh : మహబూబాబాద్ జిల్లాకు చెందిన గిరిజన యువకుడు భుక్యా యశ్వంత్ మౌంట్ కాంగ్ యాట్సే -2 పర్వతాన్ని అధిరోహించాడు. మరిపెడ మండలం ఉల్లేపల్లి భూక్యా తండాకు చెందిన పర్వతారోహకుడు యశ్వంత్ 6వేల 2వందల 50 మీటర్ల ఎత్తయిన మౌంట్ కాంగ్ యాట్సే-2ను అధిరోహించాడు. అక్కడ జాతీయ జెండాను ప్రదర్శించాడు.
సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను ప్రదర్శించి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. తన విజయంలో ముఖ్యమంత్రి అందించిన సహకారం మరిచిపోలేనిదని లేఖలో గుర్తు చేశారు. ఆయన అందించిన ఆర్థిక సాయం ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. కాగా యశ్వంత్ ప్రతిభను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెలలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. మున్ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడాని ప్రయత్నిస్తానని, తన విజయాలతో పాటు ఇతరులను ప్రేరేపించడమే తన లక్ష్యమని యశ్వంత్ చెప్పారు.