బ్రహ్మోత్సవ వైభవం- శ్రీ క్షీర భావనారాయణ స్వామి రథాన్ని లాగిన భక్తులు - Bhavanarayana Swamy Brahmotsavam - BHAVANARAYANA SWAMY BRAHMOTSAVAM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-05-2024/640-480-21545843-thumbnail-16x9-uthsvam.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 24, 2024, 12:29 PM IST
Bhavanarayana Swamy Brahmotsavams in Bapatla : బాపట్లలో శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి 1431వ నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువజామున శ్రీవారి కళ్యాణమహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం గరుడోత్సవం, స్వామివారి రథోత్సవం (బావయ్య పౌర్ణమి) నిర్వహించారు. స్వామివారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు.
రథోత్సవం జరిగే తిరునాళ్ల మహోత్సవానికి పరిసర ప్రాంత ప్రజలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తజనం విశేష సంఖ్యలో తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకులు అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో శ్రీ భావపురి అయ్యప్ప సేవా సంఘం ద్వారా అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. పట్టణ పురవీధులలో బావన్నారాయణుడు ఊరేగింపుతో వెళ్తుండగా భక్తజనం ఆ సుందర దృశ్యాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున బారులు తీరారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.