భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం - రెండో ప్రమాద హెచ్చరిక జారీ - Bhadrachalam Godavari Water Level
🎬 Watch Now: Feature Video
Bhadrachalam Godavari Water Level Today News : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. గత రెండు రోజుల క్రితం 51.6 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం మంగళవారం నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాత్రి 45 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతూ ఈరోజు ఉదయం ఉదయం 10 గం.కు భద్రాచలం వద్ద 47.5 అడుగుల వద్దకు చేరింది. మధ్యాహ్నానికి 48.2 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాచలం వద్ద స్నానఘట్టాల ప్రాంతం, కల్యాణ కట్ట ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీత వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వరద నీటిలోనే మునిగి ఉంది. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వల్ల 25 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. నీటిమట్టం మరింత పెరగడం వల్ల భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రహదారులపై వరద నీరు తగ్గలేదు.