LIVE : కరీంనగర్ జిల్లా రేకుర్తిలో బతుకమ్మ సంబురాలు - ప్రత్యక్ష ప్రసారం - BATHUKAMMA CELEBRATIONS Telangana
🎬 Watch Now: Feature Video
Published : Oct 5, 2024, 5:06 PM IST
|Updated : Oct 5, 2024, 9:06 PM IST
Bathukamma Celebrations In Telangana Live : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజు బతుకమ్మ వేడకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగలో నాలుగో రోజును నానబియ్యం బతుకమ్మ అంటారు. ప్రతిరోజులాగే ఈరోజు బతుకమ్మను పేర్చి, ఆటపాటలతో పూజించి నిమజ్జనం చేస్తారు. గౌరమ్మకు నైవేద్యంగా ఈరోజు నానబియ్యంతో చేసిన పాయసం సమర్పిస్తారు. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడుతున్నారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్టుగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో, ఆడపడుచులతోనూ మురిసిపోయాయి. మహిళామణుల పండుగగా పిలుచుకోనే బతుకమ్మలో సందడిగా ఆడిపాడుతున్నారు. తీరొక్క పూలతో అందంగా తీర్దిదిద్దిన బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడుతున్నారు. కోలాలతో ఆడుతున్నారు. తెలంగాణలో మహిళలకు మహా ఇష్టమైన పండుగ బతుకమ్మ వేడుక. ఆదిపరాశక్తిని అరవిరిసిన సుమాల్లో దర్శిస్తూ, పాటలతో ప్రస్తుతిస్తూ పరవశించిపోతారు. 9 రోజుల ఈ వేడుకలో తంగేడు, జిల్లేడు, గునుగు, బంతి, చేమంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూశాయా అనిపిస్తాయి.
Last Updated : Oct 5, 2024, 9:06 PM IST