LIVE : కరీంనగర్‌లో బండి సంజయ్ మీడియా సమావేశం - Bandi Sanjay Live
🎬 Watch Now: Feature Video
Published : Mar 13, 2024, 1:10 PM IST
|Updated : Mar 13, 2024, 2:00 PM IST
Bandi Sanjay Live : తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. పథకాల అమలును ఎటువంటి షరతులు విధించకుండా ప్రజలందరికీ అందించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై, బీఆర్ఎస్ నేత పరుషపదజాలం వాడటం సబబు కాదని, ఇది ఆ పార్టీ అహంకారాన్ని చూపెడుతోందని దుయ్యబట్టారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. అసలు పోటీ చేద్దామా లేదా అనే భావనలో ఆ పార్టీ ఉందని చెప్పారు.దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుటుంన్నారని బండి సంజయ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 17 స్ధానాలకు గాను 17 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. గులాబీ పార్టీతో ఎప్పటికీ కమలం పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. తాజాగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
Last Updated : Mar 13, 2024, 2:00 PM IST