బీఆర్ఎస్​ నాయకులకు సర్పంచుల గురించి మాట్లాడే హక్కు లేదు : బండి సంజయ్ - Bandi Sanjay Instruction to Congres

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 3:26 PM IST

Bandi Sanjay on Sarpanch Funds in Telangana : సర్పంచుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్​ నాయకులకు లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే వారికి ఈ దుస్థితి పట్టిందని ఆయన దుయ్యబట్టారు. గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించక పోవడం వల్లనే వారు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి సర్పంచులు ఆందోళన చేసేందుకు సిద్ధమైనట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఆ విషయంలో వారి పోరాటం న్యాయమైనదేనని హితవు పలికారు.

Bandi Sanjay Fire on BRS Leaders : పార్టీ నాయకత్వంతో మాట్లాడి సర్పంచుల పోరాటానికి మద్దతిస్తానని బండి సంజయ్(Bandi Sanjay) స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాసిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను, సర్పంచులకు చేసిన మోసాలను సరిదిద్దాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని సలహా ఇచ్చారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ మాదిరిగా కాంగ్రెస్​కు గుణపాఠం తప్పదన్నారు. కరీనంగర్‌ మహిళా కళాశాల విద్యార్ధినుల కోసం రూ.10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ జనరేషన్ సిస్టమ్​ను ఆయన పరిశీలించారు.   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.