ప్రకాశం జిల్లాలోని కోర్టు ఆవరణలో ఆరు కొండ చిలువ పిల్లల కలకలం - Baby Pythons In Court Complex - BABY PYTHONS IN COURT COMPLEX
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 10:22 PM IST
Baby Pythons at Markapuram Court Complex in Prakasam District : ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కోర్టు సముదాయంలో కొండ చిలువ పిల్లలు ఉండటం స్థానికంగా కలకలం రేపింది. కోర్టు ప్రాంగణంలో ఒకే చోట ఆరు కొండ చిలువ పిల్లలు ఉండటాన్ని అక్కడున్న సిబ్బంది గమనించారు. వెంటనే కోర్టు సిబ్బంది అటవీ శాఖ స్నేక్ క్యాచర్ నిరంజన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అతను వచ్చి చెట్ల పొదల్లో ఉన్న ఆరు పాము పిల్లలను పట్టుకున్నాడు. వెంటనే స్నేక్ క్యాచర్, తల్లి కొండ చిలువ కోసం కోర్టు ప్రాంగణంలో వెతకగా అది ఎక్కడా కనిపించలేదని అతను తెలిపాడు.
అయితే ఆ చిన్న కొండ చిలువల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని స్నేక్ క్యాచర్ పేర్కొన్నాడు. అతను వాటి ఆరోగ్య పరిస్థితి చూసి అడవిలో వదిలి పెట్టనున్నట్లు తెలిపాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద కొండచిలువ ఎక్కడైనా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్ విజ్ఞప్తి చేశాడు.