చెర్వుగట్టు ప్రధాన అర్చకుడికి అయోధ్య ఆహ్వానం - ప్రాణప్రతిష్ఠకు రావాలని పిలుపు - అయోధ్య ఆహ్వానం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 19, 2024, 11:25 PM IST

Ayodhya Temple Invitation To Chervugattu Priest: నల్గొండ జిల్లా నార్కట్​పల్లి మండలంలోని ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడికి అయోధ్య ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు చెర్వుగట్టు ప్రధాన అర్చకులు, కరసేవకులైన పోతులపాటి రామలింగేశ్వర శర్మకు ఆహ్వాన పత్రిక రావడంతో, ఆయన అనందం వ్యక్తం చేశారు.  

Priest about Ayodhya Invitation : ఈ సందర్భంగా చెర్వుగట్టు ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ మాట్లాడారు. ఎందరో కరసేవకులు ఉన్నప్పటికీ తనకు ఈ ఆహ్వానం రావడం యాదృచ్ఛికమన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి, బాల రాముడు విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొనాలని శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్రం నుంచి ఆహ్వానం వచ్చినట్లు తెలిపారు. అయోధ్యకు శ్రీరాముడే పిలిచినట్లు ఉందని, అక్కడ కాలు మోపడమే గొప్ప అవకాశమని అన్నారు. అయోధ్య ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని సేవ చేసుకుంటానని తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.