రెచ్చిపోయిన సర్పంచ్​ కుమారుడు - కుర్చీ కోసం ఆర్​ఐపై దాడికి యత్నం - ఆర్​ఐపై దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 8:41 PM IST

Attack on RI In Satya Sai District: రాష్ట్రంలో రెవెన్యూ అధికారులపై జరుగుతున్న దాడులు భయపెడుతున్నాయి. విశాఖలో తహసీల్దార్‌ రమణయ్య హత్య ఘటన మరవక ముందే సత్యసాయి జిల్లాలో సర్పంచ్​ కుమారుడు ఆర్​ఐపై దాడికి యత్నించాడు. అసభ్యకరంగా బూతులు తిడుతూ సచివాలయ కార్యాలయంలోని ఫర్నీచర్​ ధ్వంసం చేశాడు. 

జిల్లాలోని కొత్తచెరువు మండలంలోని లోచర్ల గ్రామ సర్పంచ్​ కుమారుడు నారాయణస్వామి ఆర్​ఐపై చెప్పుతో దాడికి యత్నించాడు. ఆర్​ఐ దుర్గేష్​ విధుల్లో భాగంగా ఓ వృద్ధురాలి వివరాలను కంప్యూటర్​లో​ నమోదు చేస్తున్నాడు. అదే సమయంలో సచివాలయానికి సర్పంచ్​ కుమారుడు వెళ్లాడు. తనకు కూర్చునేందుకు కుర్చీ ఇవ్వాలని సర్పంచ్​ కుమారుడు కోరగా, వృద్ధురాలి వివరాలు నమోదు చేసుకుంటున్నానని కొద్దిసేపు వేచి ఉండమని చేప్పేందుకు ఆర్​ఐ యత్నించాడు. ఈ క్రమంలోనే నారాయణ స్వామి తనకే కూర్చోడానికి కుర్చీ ఇవ్వవా అంటూ దుర్గేష్​పై చెప్పుతో దాడికి యత్నిస్తూ దుర్భాషలాడాడు. తానే సర్పంచ్​నని ఎందుకు కుర్చీ ఇవ్వలేదు అంటూ నానా హంగామా చేశాడు. అక్కడున్న వారు నారాయణస్వామిని అడ్డుకున్నా ఆగకుండా అలాగే బూతులు తిడుతూ దాడి యత్నాన్ని ఆపలేదు. కార్యాలయంలోని ఫర్నిచర్​ను సైతం​ ధ్వంసం చేశాడు. అలాగే బూతులు తిడుతూ నారాయణస్వామి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఘటనపై ఆర్​ఐ కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.