YUVA : ఆమె గురిపెడితే పతకం పక్కా - ఒలింపిక్ మెడలే నెక్ట్స్ టార్గెట్ - Arjuna Award Esha Singh Interview - ARJUNA AWARD ESHA SINGH INTERVIEW
🎬 Watch Now: Feature Video


Published : Jun 30, 2024, 7:30 PM IST
Arjuna Award Esha Singh Interview : ఆ టీనేజర్ దూసుకెళ్లే ఓ బుల్లెట్. పదేళ్ల ప్రాయంలోనే పిస్టల్ చేతబట్టి 13 ఏళ్లకే జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లో పతకాలు కొల్లగొడుతూ రికార్డులు తిరగరాస్తోంది. ఇది వరకే ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను ఖాతాలో వేసుకున్న ఆ షూటింగ్ స్టార్ ఇటీవలే జకార్తా ఆసియా క్వాలిఫయర్స్‌లో విజేతగా నిలిచి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం దక్కించుకుంది.
ఎలాంటి అంచనాలు లేకుండా తన ప్లానింగ్‌ని నమ్ముకుని ఇంతటి విజయాలు సాధించాను అంటుంది ఈ అమ్మాయి. ఏదైనా ఆటలో పోటీ పడేటప్పుడు టైటిల్‌ను బట్టి ప్రణాళికలు మార్చకుండా, అభ్యర్థి మూలాలను గుర్తుంచుకుని పోటీ పడాలి అని సూచిస్తుంది. అభ్యర్థి క్రమశిక్షణ, ఆసక్తే వారి విజయం వైపు నడిపిస్తుంది అంటుంది. భవిష్యత్తులో ఆటతో పాటు తాను చదువుకుంటున్న బిజినెస్‌లో రాణిస్తానని చెబుతోంది. గురి తప్పకుండా ఒలింపిక్ పతక లక్ష్యాన్ని సాధిస్తానని చెబుతున్న హైదరాబాదీ షూటర్ ఈషా సింగ్‌తో చిట్‌చాట్.