తాగనేలేదు, పరీక్ష ఎలా చేస్తారు - పోలీసులతో లాయర్ వాగ్వాదం - Fight Between Lawyer And police
🎬 Watch Now: Feature Video
Published : Feb 3, 2024, 4:06 PM IST
Argument Between Lawyer And police in Kamareddy : డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే సమయంలో ఓ న్యాయవాది పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి డీఎస్పీ ప్రకాష్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అదే పట్టణానికి చెందిన సుజిత్ గౌడ్ అనే న్యాయవాది బైక్‌ను పోలీసులు ఆపి తనని టెస్టు చేయాలని పోలీసులు అతనికి సూచించారు. దీంతో తాను మద్యం తాగలేనని తనకు మద్యపానం పరీక్ష ఎలా చేస్తారని పోలీసులతో గొడవకు దిగాడు.
ఆపై పోలీసులే తన వద్దకు వచ్చి, తాను తాగకున్న, అనుమతి లేకుండా ఫోన్లో వీడియోలు చిత్రీకరించి, దాడి చేశారని ఆరోపించారు. బ్రీత్ ఎనలైజర్‌కు సహకరించకపోవడంతో పోలీస్ వాహనంలో వైద్య పరీక్షల నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్య పరీక్షలను నిరాకరించడంతో మళ్లీ పోలీసులకు, అతనికి వాగ్వాదం చోటుచేసుకుంది. సుమారు రెండున్నర గంటల పాటు ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు సుజిత్‌ను దేవునిపల్లి స్టేషన్‌కు తరలించారు.