LIVE: దిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష- ప్రత్యక్షప్రసారం - APCC Chief YS Sharmila Deeksha Live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 3:10 PM IST
|Updated : Feb 2, 2024, 3:25 PM IST
APCC Chief YS Sharmila Deeksha in Delhi Live: కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో ఏపీసీసీ (APCC) చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014, విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బాగు, భవిత కోసం అంటూ నాటి కాంగ్రెస్ సర్కారు పొందుపరిచిన వాగ్దానాలను అమలుపరచాలని కోరారు. నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక చారిత్రక అవసరంగా గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.. అటు ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూడా ఎన్నో వాగ్దానాలను చట్టంలో పొందుపరిచిందని తెలిపారు.
కానీ, పది సంవత్సరాల్లో ప్రజలను తీవ్ర నైరాశ్యంలోకి తోసేస్తూ, అటు కేంద్ర, ఇటు రాష్ట్ర సర్కారులు వాగ్దానాల అమలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఈ రెండు అత్యంత ప్రముఖమైన వాగ్దానాలని ఉదహరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ కేంద్రంపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఒత్తిడి పెంచనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన షర్మిల దిల్లీలో ఈరోజు దిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో దిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష ప్రత్యక్షప్రసారం.