మరో రూ. 4 వేల కోట్లు - రూ. 12 లక్షల కోట్లకు చేరువలో రాష్ట్ర అప్పు - RBI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 7:59 PM IST
AP Loan From RBI Through Securities Auction: సెక్యూరిటీల వేలం ద్వారా రిజర్వు బ్యాంకు (Reserve Bank of India) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 4 వేల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది. వెయ్యి కోట్ల రూపాయల చొప్పున మూడు లాట్లు, 500 కోట్ల రూపాయల చొప్పున రెండు లాట్లలో సెక్యూరిటీల వేలం వేసి ఈ రుణాన్ని తీసుకున్నారు. 5 ఏళ్ల నుంచి 19 ఏళ్ల పాటు చెల్లింపు కాలవ్యవధిలో 4 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర 5 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 4 వేల కోట్ల రుణాన్నీ తీసుకున్నాయి. ప్రస్తుత నాలుగు వేల కోట్ల రుణంతో ఏపీ ఈ ఆర్థిక సంవత్సరంలో తెచ్చిన అప్పు లక్షా 2 వేల కోట్ల రూపాయలకు చేరింది. అనుమతించిన స్థాయి కంటే అప్పులు చేసి ఎఫ్ఆర్బీఎం నిర్దేశించిన పరిధిని ఇప్పటికి 22 సార్లు ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించిందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. రాష్ట్ర మొత్తం అప్పు రూ. 12 లక్షల కోట్లకు చేరువలో ఉందని టీడీపీ నేత జీవీ అన్నారు. ఇది దేశ చరిత్రలో కనీవిని ఎరుగని ఘోరమని మండిపడ్డారు.