LIVE: ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న పవన్ కల్యాణ్ - మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - ap Dy CM Pawan kalyan Live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2024, 10:35 AM IST

Updated : Sep 22, 2024, 10:41 AM IST

AP Deputy CM Pawan kalyan Live : తిరుమల లడ్డూ అపవిత్రంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుకొండలవాడా క్షమించు అంటూ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ గత పాలకుల వికృత పోకడలతో అపవిత్రమైందన్నారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమని పేర్కొన్నారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని అన్నారు.తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనన్నారు. ఈ క్రమంలోనే సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Last Updated : Sep 22, 2024, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.