ఓపీఎస్ సాధించే వరకు ఉద్యమం ఆగదు- సాగర సంగ్రామ దీక్షలో నినదించిన ఉద్యోగులు - Protests by teachers in AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 2:48 PM IST
|Updated : Feb 4, 2024, 7:51 PM IST
AP CPS Association Sagara Sangrama Deeksha: విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీ సీపీఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగర సంగ్రామ దీక్ష (Teachers Protests in AP) జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు, సంఘాల నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు కానీ, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని మాత్రం అమలు చేయకుండా తమను మోసం చేశారని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్‌తో నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండ గడుతూ ఫ్లెక్సీలను దీక్ష వద్ద ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.