LIVE : అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన - CHANDRABABU VISITS AMARAVATI LIVE - CHANDRABABU VISITS AMARAVATI LIVE
🎬 Watch Now: Feature Video


Published : Jun 20, 2024, 11:46 AM IST
|Updated : Jun 20, 2024, 12:46 PM IST
AP Chief Minister Chandrababu visit to Amaravati Live : ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని తెలుసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీంచారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలు పెట్టిన ప్రాంతాలకు వెళుతున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు - ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Jun 20, 2024, 12:46 PM IST