యాదాద్రి పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం - 25 వరకు వేడుకలు - Yadadri Brahmotsavam 2024
🎬 Watch Now: Feature Video
Published : Feb 19, 2024, 5:09 PM IST
Annual Brahmotsavam Of Patagutta In Yadadri : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వస్తివాచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 25వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే ఫిబ్రవరి 21 తేదీన ఎదుర్కోలు, 22వ తేదీన తిరుకల్యాణం, 23 తేదీన దివ్య విమాన రథోత్సవం జరగనున్నాయి. నేడు స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, ఫిబ్రవరి 25 తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి.
Yadadri Patagutta Annual Brahmotsavam : ఆలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లకు స్వస్తి, పుణ్యవాచనం, రక్షా బంధనం గావించారు. అనంతరం పండితులకు దీక్షా వస్త్రాలను అందజేశారు. ఈ నెల 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు కన్నులపండువగా సాగనున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు.