డ్యూయల్‌ డిగ్రీతో ఉద్యోగ అవకాశాలు - ఆంధ్రా విశ్వవిద్యాలయం శ్రీకారం - Dual Degree Courses in AU - DUAL DEGREE COURSES IN AU

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2024, 5:49 PM IST

Andhra University Introduced Dual Degree Courses : పరిశ్రమల అవసరాలు మారుతున్నాయి. దాంతో వైవిధ్యమైన నైపుణ్యాలు ఉన్న యువతరాన్ని ఆశిస్తున్నాయి. ఒక అంశంలో మాస్టర్‌ అయినప్పటికీ, దానికి దగ్గరి సంబంధమున్న ఇతర సబ్జెక్టులపై కూడా పట్టు కలిగి ఉండాలని నిర్దేశిస్తున్నాయి. తదనుగుణంగా మన విద్యార్థులను తీర్చిదిద్దేలా, ఉద్యోగ సాధనలో అర్హతలను పెంచుకునేలా కోర్సుల్లో మార్పులకు శ్రీకారం చుడుతోంది విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం. మరి రెండు డిగ్రీలతో మెరుగైన ఉద్యోగావకాశాలు ఎంత మేరకు పెరుగుతాయి? కోర్సుల ఎలా బోధిస్తారు? వంటి అంశాలను ఏయూ ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య శశిభూషణరావు వెల్లడించారు.  

ప్రస్తుతం 80 శాతం పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏఐ, ఎమ్​ఎల్ ఆధారిత సేవల ద్వారా వినియోగించుకునేందుకు అడుగులు వేస్తున్నాయని తెలిపారు. ఈ కోర్సుల ప్రాధాన్యతను గుర్తించి దాదాపుగా 58 దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు డ్యూయల్ డిగ్రీ కోర్సులను చేస్తున్నారని వెల్లడించారు. అలాగే మన విద్యార్థులు సైతం ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. విభిన్ననైపుణ్యాలు ఉంటే కంపెనీల్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నారు. డ్యూయల్‌ డిగ్రీ చేసిన విద్యార్థులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందని వివరించారు. దీంతో విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుతోపాటు లక్ష్య సాధన సులభతరం అవుతుందని వీసీ ఆచార్య శశిభూషణరావు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.