ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల నిరసన - Andhra Pragati Grameen Bank
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-02-2024/640-480-20821676-thumbnail-16x9-bank-employees-protest.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 1:48 PM IST
Bank Employees Protest : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు. మార్కాపురం రీజినల్ కార్యాలయం పరిధిలోని అన్ని గ్రామీణ బ్యాంక్ లను మూసేసి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. వాణిజ్య బ్యాంకులతో సమానంగా పదోన్నతులు కల్పించాలని కోరారు. బ్యాంకుల్లో ఉన్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరించి ఖాళీగా ఉన్న 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 2018 వరకు ఉన్న గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే విడతల వారీగా ధర్నాలు చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయాలి. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు ఖాళీలను భర్తీ చేయాలి. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా కంప్యూటరీకరణ, పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి. - చంద్రశేఖర్ బ్యాంక్ ఉద్యోగి
స్టాఫ్ రిక్రూట్ మెంట్ ప్రధాన సమస్యగా మేం ఆందోళన చేపట్టాం. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. - సమీరా, బ్యాంక్ ఉద్యోగి