LIVE : తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా - Amit Shah Election Campaign - AMIT SHAH ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
Published : Apr 25, 2024, 2:10 PM IST
Amit Shah Telangana Lok Sabha Election Campaign : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చేశారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో సిద్దిపేటకు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో కేంద్ర ప్రభుత్వం పదేళ్లులో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలను వివరిస్తున్నారు. అలాగే గత బీఆర్ఎస్ సర్కారు అవినీతి అక్రమాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలు అంశాలపై రెండు పార్టీలను ఎండగడుతున్నారు. మరోసారి మోదీ ప్రభుత్వం కేంద్రంలో రావాల్సిన అవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. బహిరంగ సభ ముగించుకుని హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడే భోజనం పూర్తి చేసిన అనంతరం ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళ్లనున్నారు.