LIVE : హైదరాబాద్‌ పాతబస్తీలో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా అమిత్​షా ప్రచారం - Amit Shah Election Campaign in Hyd

By ETV Bharat Telangana Team

Published : May 1, 2024, 9:38 PM IST

Updated : May 1, 2024, 10:02 PM IST

thumbnail

Amit Shah Election Campaign in Hyderabad LIVE : సార్వత్రిక ఎన్నికల ప్రచార నేపధ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ విచ్చేశారు. ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న అమిత్‌ షా, అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా లాల్​దర్వాజకు చేరుకున్నారు. బీజేపీ హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. లాల్​దర్వాజ నెహ్రూ విగ్రహం నుంచి సుధా టాకీస్‌ వరకు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గంట పాటు ఈ రోడ్‌ షో కొనసాగనుంది. అనంతరం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవడంతో పాటు, బీజేపీ పదేళ్ల పాలనను ఇంటింటికి వివరించేలా నేతలకు మార్గనిర్దేశనం చేయనున్నట్లు కమల వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో బస చేయనున్నారు.

Last Updated : May 1, 2024, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.