LIVE : ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం - Amit Shah Telangana Tour
🎬 Watch Now: Feature Video
Published : Mar 12, 2024, 2:30 PM IST
|Updated : Mar 12, 2024, 4:44 PM IST
Union Minister Amit Shah Telangana Tour Live : ఈసారి ఎలాగైనా తెలంగాణలోని లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో సీట్లు సాధించాలని కమల దళం భావిస్తోంది. ఈ క్రమంలో 17 లోక్‌సభ స్థానాల్లో కనీసం ఆరు లేదా ఏడు గెలుచుకోవాలని చూస్తుంది. అందులో భాగంగా బీజేపీ విజయసంకల్ప యాత్రలు, ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన, కేంద్రమంత్రుల పర్యటనలు తెలంగాణలోని బీజేపీ శ్రేణులకు ఊపును తెప్పిస్తున్నాయి. పదేళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టిందో వివరించారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. అమిత్ షా అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ జరుగుతున్న సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో వారు ఎలా పని చేయాలో, ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలో వారికి వివరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు నగరంలో వివిధ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి అమిత్ షా బిజీబిజీగా గడుపుతూ రాత్రి దిల్లీకి పయనం కానున్నారు.
Last Updated : Mar 12, 2024, 4:44 PM IST