సీఎం జగన్‌కు రాజధాని రైతుల నిరసన సెగ - జై అమరావతి అంటూ నినాదాలు - CM Jagan Convoy
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 12:54 PM IST
Amaravati Farmers Tried to Stop CM Jagan Convoy: సీఎం జగన్‌కు రెండో రోజూ రాజధాని రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. అసెంబ్లీకి సమావేశాల కోసం జగన్ వెళ్తున్న సమయంలో రాజధాని రైతులు రోడ్డు పక్కకు నిలుచొని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మందడం దీక్షా శిబిరం వద్దకు సీఎం కాన్వాయి రాగానే మహిళలు, రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆకుపచ్చ జెండాలు పట్టుకుని ఏకైక రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేశారు.
సోమవారం కూడా ముఖ్యమంత్రి జగన్‌కు రాజధాని రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. శాసనసభ సమావేశంలో పాల్గొన్నందుకు అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో రాజధాని రైతులు జై అమరావతి జయహో అమరావతి అంటూ నినదించారు. ముఖ్యమంత్రి వాహన శ్రేణి మందడం దీక్షాశిబిరం దగ్గరికి రాగానే రైతుల మహిళలు ఒక్కసారిగా జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులు రోడ్డు మీదికి రాకుండా పోలీసులు అడ్డుగా నిలిచారు. అదే విధంగా ఈ రోజు కూడా రాజధాని రైతుల నుంచి ముఖ్యమంత్రి జగన్‌కు నిరసన సెగ తగిలింది.