రాజధాని రైతుల 'కృతజ్ఞత పాదయాత్ర' - బ్రహ్మరథం పడుతున్న ప్రజలు - Amaravati Farmers Padayatra - AMARAVATI FARMERS PADAYATRA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 28, 2024, 5:09 PM IST
Amaravati Farmers Padayatra Continues in Parchur of Bapatla District : రాజధాని రైతులు తిరుమలకు చేపట్టిన కృతజ్ఞత పాదయాత్ర బాపట్ల జిల్లా పర్చూరులో సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. దీంతో రాజధాని రైతులు మొక్కులు చెల్లించుకోవడానికి ఈ నెల 24న తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. "అమరావతికి మళ్లీ పూర్వవైభవం రావడంతో దేవదేవుళ్లకు, న్యాయదేవుళ్లకు, ఓటరు దేవుళ్లకు కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ పాదయాత్ర చేపట్టాం. కష్టాల్లో ఉన్న తాము ఇదే రహదారిలో అమరావతి నుండి తిరుమలకు పాదయాత్ర చేశాం. ఆ సమయంలో ఈ ప్రాంత ప్రజలు తమకు పలికిన ఘనస్వాగతం జీవితంలో మర్చిపోలేం. రోజూ 25 నుంచి 30 కిలోమీటర్ల మేర 16 రోజుల పాటు కాలినడకన తిరుమలకు చేరుకుంటాం" అని రాజధాని రైతులు తెలిపారు.
పాదయాత్రలో భాగంగా ఈరోజు అమరావతి రైతులకు పర్చూరులోని ఓ పాఠశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. చిన్నారులంతా జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అలాగే పాదయాత్రలో రైతులకు అడుగడుగునా గ్రామస్థులు బ్రహ్మరథం పడుతూ, జై అమరావతి, ఎన్డీఏ కూటమి వర్దిలాల్లి, జై బాబు అంటూ నినాదాలు చేశారు.