డాక్టర్ కావాలన్న లక్ష్యమే ఆలిండియా నీట్ టాపర్గా నిలిపింది : సందీప్ చౌదరీ - NEET 2024 Topper Sandeep Chaudhary Interview - NEET 2024 TOPPER SANDEEP CHAUDHARY INTERVIEW
🎬 Watch Now: Feature Video


Published : Jun 7, 2024, 5:07 PM IST
Allindia NEET 2024 Topper Interview : వైద్యవిద్య అడ్మిషన్ల కోసం విర్వహించే నీట్ పరీక్ష.. దేశంలో అత్యధికంగా పోటీ, కఠినతరమైన పరీక్షలలో ఒకటి. ఈపరీక్షకు ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు సన్నద్ధమవుతుంటారు. కానీ కొద్ది సంఖ్యలోనే విజయం సాధిస్తుంటారు. ఈ పరీక్షలో ఆలిండియా టాపర్ కావడమంటే మామూలు విషయమేమి కాదు. ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలకోసం లక్షలాది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, నీట్ యూజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి.
ఎన్టీఏ నిర్వహించే ఈ పరీక్షలో, తెలుగు విద్యార్థులు మరోసారి ఆలిండియా ర్యాంకులతో మెరిశారు. దేశవ్యాప్తంగా ఏకంగా 67 మంది ప్రథమ ర్యాంకు సాధిస్తే, అందులో నలుగురు తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఆ అత్యుత్తమ ర్యాంకర్లలో ఒకరు సందీప్ చౌదరి. మరి, దేశంలోనే కష్టతరమైన ఈ పరీక్షలో ఒకటో ర్యాంకు సాధించేందుకు ఎలా సన్నద్ధమయ్యాడు? భవిష్యత్ లక్ష్యాలు, నీట్ సన్నద్ధమయ్యే వారికి తన సలహాలు తన మాటల్లోనే విందాం.