రాష్ట్రంలో అరాచక పాలన, ధర్మవరంంలో రాక్షస పాలన: సత్యకుమార్ - bjp leader satyakumar fires on ycp - BJP LEADER SATYAKUMAR FIRES ON YCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 8:21 PM IST
Alliance Dharmavaram Candit Satyakumar Comments On Ysrcp Mla: అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా దోచుకోవడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుందని ధర్మవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ధర్మవరాన్ని అధర్మవరంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన, ధర్మవరం నియోజకవర్గంలో రాక్షస పాలన సాగుతోందని సత్యకుమార్ విమర్శించారు.
ధర్మవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి దోచుకుంటుంటే ధర్మవరంలో మాత్రం పంచభూతాలను కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి దోచుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో చెరువును కబ్జా చేసి విలాసవంతమైన భవనం కట్టించుకున్నాడని మండిపడ్డారు. ధర్మవరం నియోజకవర్గం ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని సత్యకుమార్ ధీమా వ్యక్తం చేశారు. కష్టం విలువ, ప్రజల కష్టాలు తెలిసిన వాడినని తనను ఆదరించి ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను సత్యకుమార్ కోరారు. తనను నమ్మి గెలిపిస్తే ధర్మవరం పేరును హస్తినాలో వినిపించేలా అభివృద్ధికి బాధ్యతగా కృషి చేస్తానని చెప్పారు.