రాష్ట్రమంతటా జోరుగా వర్షాలు- కరవు సీమపై కరుణించని వరుణుడు - Drought Conditions - DROUGHT CONDITIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 1:11 PM IST

Updated : Jul 21, 2024, 1:33 PM IST

Agricultural Meteorologist Narayanaswamy Interview: ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతుంటే కరవు సీమ అనంతలో అందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు రోజులుగా మేఘాలు ఊరిస్తున్నా చినుకు జాడ లేదు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తొలి వారంలో కురిసిన వర్షంతో రైతులు పంటలు సాగుచేశారు. జిల్లా వ్యాప్తంగా ఏటా 8.57 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు సాగుచేస్తుండగా, ఇప్పటి వరకు కేవలం 1.60 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనం వేశారు. 

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 20 శాతం విస్తీర్ణంలో మాత్రమే ఖరీఫ్ పంటలు సాగుచేయగా, అనంతపురం జిల్లాలో 14 శాతం విస్తీర్ణంలో మాత్రమే రైతులు విత్తనం వేయగలిగారు. ఈ ఖరీఫ్‌లో తొలకరి వర్షాలకు పంటలు సాగు చేసిన రైతులు వాన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులకు కారణాలేంటనే అంశాలపై వాతావరణ వ్యవసాయ శాస్త్రవేత్త నారాయణస్వామితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి మీకోసం.

Last Updated : Jul 21, 2024, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.