LIVE : రామ్‌చరణ్‌కు వేల్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రదానం.. ప్రత్యక్షప్రసారం - ramcharan live - RAMCHARAN LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 13, 2024, 4:12 PM IST
|Updated : Apr 13, 2024, 5:17 PM IST
Ramcharan received Doctorate LIVE : టాలీవుడ్ మెగా పవర్‌స్టార్, హీరో రామ్‌చరణ్‌కు తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చరణ్‌కు గౌరవ డాక్టరేట్ అందించారు. రామ్‌చరణ్ డాక్టరేట్ అందుకోవడంపై పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. తెలుగు నటుడికి అరుదైన గౌరవం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. రామ్‌చరణ్‌కు వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించడంపై పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.'చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషంగా ఉంది. చరణ్‌కు ఉన్న ప్రేక్షకాదరణ, అతడు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలను గుర్తించి తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని ప్రకటించడం ముదావహం. ఈ స్ఫూర్తితో అతడు మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని, మరెన్నో పురస్కారాలు, మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నా' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Last Updated : Apr 13, 2024, 5:17 PM IST