thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 12:33 PM IST

ETV Bharat / Videos

జగన్​లాంటి వాళ్లు వీధికొక్కరు - పవన్​లాంటి వాళ్లు రాష్ట్రానికి ఒక్కరే​ : పృథ్వీరాజ్ - Prudhvi Raj on YCP

Actor Prudhvi Raj Comments on YCP Government: శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు విజయం ఎన్డీఏ కూటమిదేనని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భారీ మెజారిటీతో గెలుపొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాదగయ క్షేత్రం, శ్రీపాద వల్లభుడిని పృథ్వీరాజ్ దర్శించుకున్నారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం చేస్తున్న అసత్య ప్రచారాలను పృథ్వీరాజ్ తీవ్రంగా ఖండించారు. ముద్రగడ ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

జగన్‌ లాంటివాళ్లు వీధికి ఒక్కరు ఉంటే పవన్ కల్యాణ్ లాంటివాళ్లు రాష్ట్రానికి ఒక్కరే ఉంటారని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పే నిజమైన నాయకుడు పవన్‌ కల్యాణ్ అని ప్రశంసించారు. వైసీపీ నేతలపై పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే పవన్​ కల్యాణ్​ తరపున ప్రముఖ నటుడు హైపర్​ ఆది పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేశారు. పవన్​ కల్యాణ్​ ఎన్నికల ప్రచారానికి పలువురు నటులు ఆయన తరుపున ప్రచారాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.