ETV Bharat / state

రైతులే లక్ష్యం - ఆర్గానిక్‌ ఎరువుల పేరుతో భారీ మోసం

ఆన్​లైన్​లో ఎరువులు - ఉప్పు, మెగ్నీషియం, సల్ఫేట్, రంగులు కలిపి మోసం

ORGANIC_FERTILIZERS_FRAUDS
ORGANIC_FERTILIZERS_FRAUDS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Organic Fertilizers Cheating Case in Guntur District : డబ్బు ఆశ మనిషి చేత ఏ పనైనా చేయిస్తుంది. ప్రస్తుతం ఆర్గానిక్‌ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీన్నే అక్రమార్జనకు అనువుగా మలచుకున్నారు కొంత మంది స్వార్థపరులు. తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలోనే అధిక సొమ్మును సంపాదించాలన్న దురాశతో ఆర్గానిక్‌ ఎరువుల పేరుతో ఉప్పునకు రంగు కలిపి ఆకర్షణీయ ప్యాకెట్లలో నింపి రైతులకు అంటగడుతున్నారు. వీటికి వారు పెట్టిన పేరు సూక్ష్మ పోషకాలు. కిలో, 25 కిలోల సంచుల్లో నింపి పండ్ల తోటలు, నర్సరీలు, కూరగాయల తోటల్లో వాడితే అధిక దిగుబడులు వస్తాయని రైతులకు నమ్మబలుకుతున్నారు.

వారి లక్ష్యం బిందు, తుంపర్ల సేద్య పరికరాలు వాడుతున్న రైతులు. సెప్టెంబరులో గుంటూరులో సరైన బిల్లుల్లేని 13.68 లక్షల రూపాయల విలువైన (సంచులపై ఉన్న ధరల ఆధారంగా) సరకును వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకుని ప్రయోగశాలలో పరీక్ష చేయించారు. వారు అమ్ముతున్న ఆర్గానిక్​ ఎరువులో పింక్‌ కలర్​ కలిపిన లవణం మాత్రమే ఉందని నిపుణులు నిర్ధారించారు. వ్యవసాయ శాఖ బాధ్యులపై క్రిమినల్‌ కేసు పెట్టనుంది.

నేలంతా విషమంట - రసాయన ఎరువుల దయేనట! - Chemical Fertilizers in Crops

ఒక్క శాతమూ ఎరువు ఉండదు : సూక్ష్మ పోషకాలతో కూడిన ఆర్గానిక్‌ ఎరువులంటూ (Organic Fertilizers) 20.20.0; 13.0.45; 0.0.52; 12.61.0; 19.19.19; 00.52.34 ఇలా వివిధ రకాల పేర్లతో ఆకర్షణీయ ప్యాకెట్లలో రైతులకు అంటగడుతున్నారు. ఇందులో ఒక్క శాతం కూడ ఎరువు లేకపోవడం గమనార్హం. దీన్ని వాడితే పంటలకు ఎలాంటి లాభాన్ని చేకూర్చపోగా నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా ఎంత కాలం నుంచి మోసం చేస్తున్నారన్నది తెలియలేదు. మరి కొందరు మట్టి నింపి జీవన ఎరువులు అంటూ రైతులను నట్టేట ముంచేస్తున్నారు.

మరి కొందరు ప్రముఖ కంపెనీల ఉత్పత్తుల పేర్లు పెట్టి ఆర్గానిక్‌ ఎరువులు అంటూ అంటగడుతున్నారు. వీటిని కొన్న రైతులు నీటిలో కలిపి పంటలకు వాడుతుండడంతో అందులో ఏముందో తెలుసుకోలేకపోతున్నారు. ఆర్గానిక్‌ ఎరువుల మిశ్రమాలు దేశీయంగా తయారు కావు. విదేశాల నుంచి దిగుమతి (Import from abroad) చేసుకుని ఇక్కడ ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తుంటారు. ఇందుకు భిన్నంగా నకిలీల్లో ఉప్పు, మెగ్నీషియం, సల్ఫేట్, రంగులు కలిపి మోసం చేస్తున్నారు.

పండ్ల వ్యర్థాలతో భూమిని సారవంతం- విద్యార్థుల వినూత్న ప్రయోగం - Making Fruit Peels as Fertilizers

ఉత్తరప్రదేశ్‌ నుంచి గుంటూరుకు : గుంటూరులో పట్టుబడిన ఆర్గానిక్‌ ఎరువుల తయారీ కంపెనీ ఉత్తరప్రదేశ్‌లోని సహరాంపూర్‌ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అహుజా పేరుతో అక్కడి నుంచి ఏటుకూరు రోడ్డులో ఉన్న పార్సిల్‌ కార్యాలయానికి దిగుమతి అయ్యాయి. 25 కిలోల సంచి ధర 5,790 రూపాయలు కాగా ముద్రించారు. కిలో ప్యాకెట్‌ విలువ 300 రూపాయలుగా ముద్రించారు. 25 కిలోల బస్తాలు 3 వేల కిలోలు, కిలో ప్యాకెట్లు 3 వేల కిలోల చొప్పున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సూత్రధారులను గుర్తిస్తేనే : ఆర్గానిక్‌ ఎరువుల పేరుతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రూ.కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది. వ్యవసాయ శాఖ తనిఖీల్లో పట్టుబడినప్పుడు రవాణా చిరునామా ఆధారంగా కొందరిని గుర్తిస్తున్నా వారు పాత్రధారులు మాత్రమే. పోలీసులకు వ్యవసాయ శాఖ ఫిర్యాదు చేస్తుంటే లోతైన దర్యాప్తు జరగడం లేదు. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. ఉత్తర భారతదేశంలోని ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటే పోలీసులు అంత వరకు వెళ్లరన్న నమ్మకంతో అక్రమార్కులు అక్కడి కంపెనీల పేరుతో ఇక్కడ తయారు చేయడం లేదా అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం వంటివి చేస్తున్నారు. పోలీసు అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేసి నకిలీ ఎరువులకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. రైతులు కూడా ఆన్‌లైన్‌లో ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్నారు.

గత ప్రభుత్వం వైఫల్యం - విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేక రైతుల ఇబ్బందులు - Farmers Difficulties Kharif Season

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.