Fire Breaks Out in Diwan Cheruvu Reserve Forest: తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్‌లో మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 2 గంటలు దాటాక అభయారణ్యంలో అగ్ని ప్రమాదం సంబంధించింది. దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్ని కమ్మేసింది. అటవీ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో జిల్లా అటవీ శాఖ అధికారి లూథర్ మార్టిన్ కింగ్ ఆధ్వర్యంలో 2 అగ్నిమాపక శకటాలు రిజర్వ్ ఫారెస్ట్ వద్దకు తీసుకొచ్చారు. లోపలుకు వెళ్లే మార్గం లేకపోవడంతో వాహనాలను జాతీయ ఎన్ హెచ్ 16 జాతీయ రహదారిపై నిలిపివేశారు. చెట్లు కొమ్మల ద్వారా మంటలను ఆర్పుకుంటూ ముందుకు సాగారు.
దివాన్ చెరువు చక్రద్వారా బంధం గ్రామాలతోపాటు అభయారణ్యం చుట్టూ ఉద్యానవన పొలాలు విస్తారంగా ఉన్నాయి. మంటలు పొలాలను వ్యాపిస్తాయని రైతులు ఆందోళన చెందారు అలాగే కొంతమేర పొగ జాతీయ రహదారిపై కూడా వ్యాపించింది. అగ్నిమాపు సిబ్బంది అటవీ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. కొంతమేర చెట్ల మొదళ్లలో పంటలు వ్యాపించాయి. సిబ్బంది వేగంగా మంటలను అదుపులోకి తెచ్చారు. అభయారణ్యంలో అగ్ని ప్రమాదానికి కారణాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది.
అద్భుతాలు సృష్టిస్తున్న యువకుడు - అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
పరవాడ ఫార్మాసిటీ మైదానంలో ‘వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్‌పో