పరిహారం కోసం 30 ఏళ్లుగా పోరాటం- గుంటూరులో ACC భూములను ఆక్రమించిన కార్మికులు - WORKERS OCCUPIED ACC FACTORY LANDS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-10-2024/640-480-22773860-thumbnail-16x9-acc-cement-factory-workers-occupied-lands-in-guntur.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2024, 5:18 PM IST
ACC Cement Factory Workers Occupied Lands In Guntur District : గుంటూరు జిల్లాలో ఉన్న ఎసీసీ(ACC) సిమెంట్ ఫ్యాక్టరీ భూములను కార్మికులు స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి మండలంలో ఉన్న సిమెంట్ కార్మగారం మూతపడి 30 ఏళ్లు గడిచిన కార్మికులకు చట్టబద్దంగా చెల్లించాల్సిన పరిహారాన్ని నేటికి చెల్లించకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని కార్మికులు విమర్శించారు. భూములమ్మి పరిహారం చెల్లించాలన్న హైకోర్టు తీర్పును కూడా అధికారులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా కార్మికుల వేతనాలు, రావవాల్సిన పరిహారం కోసం పోరాటం చేస్తున్న ఎటువంటి లాభం లేదన్నారు. ఇప్పటికే ఈ ఉద్యమంలో దాదాపుగా 170 మంది కార్మికులు మరణించారని తెలిపారు. ఇక తమకు ఎదురుచూసే ఓపిక లేక భూముల ఆక్రమణకు దిగామని స్పష్టం చేశారు.
కార్మికుల వేతనాలు వారిని రావవాల్సిన పరిహారం చెల్లించిన తరువాతే ఫ్యాక్టరీ భూములు అమ్మకం జరగాలని స్పష్టం చేశారు. కార్మాగారం అకారణంగా మూతపడటంతో ఎంతో మంది కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. వారు నేటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. కార్మికులు తిరిగి నిలదొక్కుకోవాలంటే చట్టప్రకారం రావాల్సిన వేతనాలు, పరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనకు వామపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.