ఏబీవీపీ నిరసనలో పోలీసుల ఓవరాక్షన్ - మహిళ కార్యకర్త జుట్టుపట్టుకొని - ఏబీవీపీ నాయకుల ధర్నా
🎬 Watch Now: Feature Video
Published : Jan 24, 2024, 10:37 PM IST
ABVP Leaders Protest in Rangareddy : రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దనీ, జీఓ నెంబర్ 55ను ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ(ABVP Leaders Protest) శంషాబాద్ కమిటీ నిరసన చేపట్టింది. విద్యార్థుల నిరసనకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మద్దతు పలికారు. ఈ నిరసనను పోలీసులు అడ్డుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో నాయకురాలిను నిలువరించేందుకు మహిళా కానిస్టేబుల్స్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ జుట్టు పట్టుకున్నారు. దీంతో ఆమె కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు విద్యార్థులు ప్రవర్తిస్తున్న తీరుపై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
100 Acres Allotment to Telangana High Court : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరవాత రాష్ట్ర హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించేందుకు 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఈ నెల 5న జీఓ విడుదల చేసింది. బుద్వేల్లోని వ్యవసాయ, ఉద్యాన విద్యాలయానికి 1966లో ఉన్న అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూమిలో 100 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవన నిర్మాణం జరిగినంత వరకు పాత హైకోర్టు భవనంలోనే కార్యకలాపాలు జరుగుతాయని వెల్లడించింది.