శ్రీశైలంలో ఏరోడ్రోమ్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు- సర్వే చేపట్టిన అధికారులు - Aerodrome in Srisailam
🎬 Watch Now: Feature Video
A Team of Officials Conducted Survey to Set up Aerodrome in Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఏరో డ్రోమ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే అధికారుల బృందం సర్వే చేపట్టింది. ఎయిర్పోర్టు ప్రాజెక్టు ఇంజినీర్ అమృత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని పర్యాటక, రెవెన్యూ, అటవీ, ఫిషరీస్, జలవనరుల శాఖల అధికారులు శ్రీశైలం చేరుకొని జలాశయం ఎగువ భాగంలో ఉన్న కృష్ణానది ఉపరితలాన్ని పరిశీలించారు. ఏరో డ్రోమ్ ఏర్పాటుకు అవసరమైన నది కొలతలను పరికరం ద్వారా తీసుకున్నారు. శ్రీశైలంలోని కృష్ణా నది ఏరో డ్రోమ్ ఏర్పాటుకు అనుకూలమైనదిగా అధికారులు గుర్తించారు. ఏరో డ్రోమ్ ఏర్పాటు చేయడం వల్ల సీ ప్లేన్ విధానం అమలులోకి వస్తుందన్నారు. దీంతో దేశ విదేశాల నుంచి పర్యాటకులు సులువుగా శ్రీశైలం చేరుకుంటారని ప్రాజెక్టు ఇంజినీర్ అధికారులకు వివరించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ వద్ద ఏరో డ్రోమ్లు ఏర్పాటు చేసి సీ ప్లేన్ విధానం అమలు చేసి రాష్ట్ర ఆదాయం పెంచుకోవడంతో పాటు పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం, కేంద్ర మంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో త్వరగా ఏరోడ్రోమ్ ఏర్పాటు చేసి సీ ప్లేన్ విధానాన్ని అమలు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు.