LIVE : గోల్కొండ కోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - Independence Day Celebrations Live - INDEPENDENCE DAY CELEBRATIONS LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 9:56 AM IST

Updated : Aug 15, 2024, 11:06 AM IST

Independence Day Celebration in Telangana : రాష్ట్రవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్​రెడ్డి ప్రసంగించారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న పంద్రాగస్టు ఇది. స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రులు, ఉన్నతాధికారులు, నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా 1200 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ వద్ద విధుల్లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు పాల్గొన్నాయి. ఇప్పటికే కోటను ఘనంగా విద్యుత్​ దీపాలతో ధగధగమనిపించేలా అలంకరణ చేశారు. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింభించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు దేదీప్యమానంగా వెలిగేలా ముస్తాబు చేశారు. మువ్వన్నెల కాంతుల సొబగులతో గోల్కొండ ఖిల్లా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 
Last Updated : Aug 15, 2024, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.