LIVE: పార్లమెంటులో రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమం -ప్రత్యక్ష ప్రసారం - CONSTITUTION DIAMOND JUBILEE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2024/640-480-22981192-thumbnail-16x9-celebration.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2024, 11:15 AM IST
|Updated : Nov 26, 2024, 11:57 AM IST
Constitution Diamond Jubilee Ceremony in Parliament : భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమూహారం కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాలు మూల స్తంభాలుగా- అన్ని విధాలా ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయం. 75సంవత్సరాలుగా సామాజిక, ఆర్థిక, లింగ భేదాలకు అతీతంగా- దేశ ప్రజల జీవితాల్నీ ప్రభావితం చేస్తూనే ఉంది. పేద, ధనిక అని తేడా లేకుండా ఓటు హక్కు, భావప్రకటన స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన ధర్మాన్ని పాటిస్తున్నారన్నా అని రాజ్యాంగ చలవే. అలాంటి భారత రాజ్యాంగం గురించి మరి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.భారత రాజ్యాంగంలోని అర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. కుల, మత, జాతి, లింగ, జన్మస్థల ప్రాతిపదికన వివక్షకు పాల్పడటాన్ని ఇది నిషేధించింది. ఉపాధి విషయంలోనూ అందరికీ సమాన అవకాశాలు పొందే ప్రాథమిక హక్కును మన రాజ్యాంగం ప్రతి పౌరునికీ అందించింది. ఇక 19వ అధికరణం ఆరు వ్యక్తిగత స్వేచ్ఛలకు పూచీగా నిలుస్తోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ, ఒక సమూహంగా ఏర్పడి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ వంటివి ఈ ఆర్టికల్ అందిస్తుంది.పార్లమెంటులో రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమం -ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Nov 26, 2024, 11:57 AM IST