ఖమ్మంలో అక్రమంగా తరలిస్తున్న 7లక్షల నగదు పట్టివేత - Cash SEIZED IN KHAMMAM - CASH SEIZED IN KHAMMAM
🎬 Watch Now: Feature Video
Published : Mar 30, 2024, 1:47 PM IST
7 Lakhs Of Cash Seized in Khammam : పార్లమెంట్ ఎన్నికల వేళ పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ అక్రమ నగదు రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేని డబ్బులు, నిషేధిత వస్తువులను రవాణా చేస్తున్నావారిపై కేసులు బుక్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా భద్రాచలంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేని రూ.7,23,000 నగదును ఎన్నికల అధికారులు పట్టుకున్నారు.
భద్రాచలం పట్టణంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మొత్తం నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయగా ఆంధ్రా చెక్‌పోస్ట్ వద్ద తాజాగా నగదు పట్టుబడింది. రోజూ నాలుగు చెక్‌పోస్టుల్లో 24 గంటలు తనిఖీలు జరుగుతున్నాయని ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు తరలించినా, నిషేధిత వస్తువులు రవాణా చేసినా వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేయడం చేస్తున్నామని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్ ఎన్నికల అధికారి బాలకృష్ణ తెలిపారు. అవసరాల కోసం తీసుకెళ్తున్న నగదుకు తప్పకుండా ఆధారాలు ఉండాలని సూచించారు.