68వ రాష్ట్రస్థాయి విలువిద్య క్రీడా పోటీలు ప్రారంభం - వారు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
🎬 Watch Now: Feature Video
Archery Sports Competition Begins in AP : రాష్ట్రంలో 68వ రాష్ట్ర స్థాయి విలు విద్య క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగంపేట గురుకుల విద్యాలయ ప్రాంగణంలో 68వ రాష్ట్ర స్థాయి విలు విద్య క్రీడా పోటీలను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. స్కూల్ గేమ్స్ అండర్-14,17,19 విభాగాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి విలు విద్య క్రీడా పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది విలువిద్య క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు.
మూడు రోజుల పాటు క్రీడలు : అనంతపురం జిల్లా గుంతకల్లులో ఉమెన్స్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు. శ్రీ శంకరనందగిరి స్వామి ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన టోర్నమెంట్లో పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. కళాశాల ప్రన్సిపల్ కేసీ హరి, ఎస్కే యూనివర్సిటీ రెక్టార్ వెంకట్ నాయుడుతో కలిసి పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు క్రీడలు జరుగుతాయని తెలిపారు.