భద్రాద్రి సీతమ్మకు కానుకగా త్రీడీ చీర - చూస్తే వావ్ అనాల్సిందే! - Making Video of 3D Saree - 3D SAREE FOR BHADRADRI SITAMMA
🎬 Watch Now: Feature Video
Published : Apr 16, 2024, 6:49 AM IST
3D saree For Bhadradri Sitamma : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ చేతివృత్తిలో తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. చేనేత వృత్తిని కేవలం ఉపాధి కోసమే కాకుండా సృజనాత్మకతతో వైవిధ్యభరితమైన వస్త్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు అనేక ప్రశంసలు అందుకున్న నల్ల విజయ్ శ్రీరామనవమి(Sri Rama Navami 2024) సందర్భంగా భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు.
3D saree Full Details : ఈ త్రీడీ చీర ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న దీని బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేశానని విజయ్ తెలిపారు. ఇందుకు రూ.48 వేలు ఖర్చు అయిందని, రంగులు మార్చే ఈ చీరను మంగళవారం భద్రాచలం సీతమ్మవారికి కానుకగా అందించనున్నట్లు వెల్లడించారు. ఈ చీరను తిప్పి చూస్తుంటే రంగులు మారుతున్నందున చూపరులvg కనువిందు చేస్తోంది. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్ నేసి ప్రశంసలు పొందారు.