ఇంటి బాత్రూమ్లో 35 పాములు- వీడియో వైరల్ - 35 Snakes In Home - 35 SNAKES IN HOME
🎬 Watch Now: Feature Video
Published : May 28, 2024, 1:38 PM IST
35 Snakes In Home At Assam : ఇంట్లో ఎక్కడైనా ఒక్క పామును చూస్తేనే భయపడిపోతాం. అలాంటిది ఒకేసారి 35 పాములు కనిపిస్తే ఇంకా అంతే కదా. ఇలాంటి ఘటనపై అసోంలో జరిగింది.
నాగావ్ జిల్లాలోని కాలియాబోర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొత్తగా ఇంటిని నిర్మించుకుంటున్నాడు. అయితే ఒక్కసారిగా ఇంటి బాత్రూమ్లో పాములు కనిపించాయి. భయంతో అతడు పక్కనే ఉన్నవాళ్లను పిలిచాడు. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ సంజీబ్ దేకాకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ ప్రాంతంలో పరిశీలించి చూస్తే, అనేక పాములు కనిపించాయి. ఒక్కొక్కటిగా మొత్తం 35 పాములను పట్టుకున్నాడు. సురక్షితంగా వేరే ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఒక్కసారిగా స్థానికులు అన్ని పాములను చూసి భయపడిపోయారు. ప్రస్తుతం ఈ పాముల వీడియో వైరల్ అవుతోంది.
"ఓ ఇంట్లో పాములు ఉన్నాయని నాకు ఫోన్ వచ్చింది. ఘటనా స్థలానికి వెళ్లి చూసినప్పుడు అక్కడ చాలా పాములు ఉన్నట్లు నేను గుర్తించాను. దాదాపు 35 పాములు పట్టుకున్నా. తర్వాత వాటని జోయిసాగ్ దలానీ ప్రాంతంలో వదిలి పెట్టాను" అని సంజీబ్ దేకా తెలిపారు.