గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లో 108 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ - 108 Feet Flag in Artillery Centre
🎬 Watch Now: Feature Video
Published : Feb 22, 2024, 12:01 PM IST
108 Feet National Flag Inauguration in Hyderabad Artillery Centre : హైదరాబాద్లోని గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లో 108 అడుగుల జాతీయ పతాకాన్ని మేజర్ జనరల్ రాకేశ్ మనోజ ఆవిష్కరించారు. పలు యుద్ధాల్లో అమరులైన వీరులకు పుష్పాంజలి ఘటించారు. జిందాల్ కంపెనీ సహాయంతో సెంటర్లో భారీ జెండాను ఆవిష్కరించినట్లు తెలిపారు. అనంతరం ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సీఈవో అశీం కోహ్లీ జెండా ఎగరేసే విధివిధానాల గురించి వివరించారు.
108 Feet Flag Inauguration in Artillery Centre : జెండా ఆవిష్కరణ వేడుకల్లో మిలటరీ బ్యాండ్ వారు నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది. అగ్నివీరులు చేసిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సీఈవో అసీం కోహ్లీ, మేజర్ జనరల్ రాకేశ్ మనోజతో కలిసి అధికారులకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మేజర్ జనరల్ రాకేశ్ మనోజ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.