ETV Bharat / technology

యూట్యూబ్​లో స్కిప్ యాడ్ బటన్​ కన్పించట్లేదా?- రీజన్ ఇదే..! - YOUTUBE SKIP ADS BUTTON MISSING

'స్కిప్ యాడ్ బటన్​ను హైడ్ చేస్తున్న యూట్యూబ్'- యూజర్స్ ప్లాబ్లమ్స్​పై ప్రతినిధి స్పందన

YouTube
YouTube (Getty Images)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 13, 2024, 5:14 PM IST

Updated : Oct 14, 2024, 11:50 AM IST

YouTube Skip Ads Button Missing: ప్రపంచంలోని వీడియో ప్లాట్​ఫామ్స్​ అన్నింటిలో యూట్యూబ్​కు ఉన్న క్రేజ్ వేరే లెవల్. చిన్న విషయం నుంచి బుర్రకు అర్థంకాని ఎన్నో అంశాలకు సంబంధించిన వీడియోలకు ఇది అడ్డాగా మారింది. అంతేకాకుండా తమ క్రియేటివిటీతో మంచి రెవెన్యూను సంపాదించుకునేందుకు చాలామంది క్రియేటర్లు యూట్యూబ్​ను వేదికగా చేసుకుంటున్నారు. అందుకే యూట్యూబ్​లో కోట్ల కొద్దీ వీడియోలు దర్శనమిస్తూ ఉంటాయి.

ఈ నేపథ్యంలో అత్యధిక ప్రజాదరణ పొందిన యూట్యూబ్ ఆదాయాన్ని పెంచుకునేందుకు తన ప్లాట్​ఫారమ్​లో స్పాన్సర్ వీడియో రికమండీషన్స్​ను అందిస్తుంది. ప్రీమియం సబ్​స్క్రిప్షన్ లేని యూజర్స్​కు వీడియోలకు ముందు లేదా వీడియో చూస్తున్న సమయంలో మధ్యలో యాడ్స్ ఇస్తుంది. అయితే యూట్యూబ్​లో స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇలా యాడ్స్ వస్తే యూజర్స్​కు చాలా చిరాకుగా అనిపిస్తుంటుంది. ఇలా మధ్యలో ప్రకటనలు రావటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సందర్భాల్లో చాలా వీడియోస్​కి కొన్ని సెకన్ల తర్వాత యాడ్స్​ను స్కిప్ చేసేందుకు ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మాత్రం యూట్యూబ్ స్కిప్ బటన్​ను హైడ్ చేస్తోందని చాలామంది వినియోగదారులు క్లెయిమ్ చేస్తున్నారు.

యూట్యూబ్ యూజర్స్ కంప్లైంట్స్: డెస్క్‌టాప్‌లో యాడ్స్ చూస్తున్నప్పుడు స్కిప్ బటన్​పై గ్రే కలర్ బాక్స్ కనిపించిందని కొందరు యూజర్స్ నివేదించారు. ఇందులో కౌంట్‌డౌన్ టైమర్ అసలు కన్పించంట్లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్స్​లో కూడా స్కిప్ బటన్ కనిపించట్లేదని ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక వెల్లడించింది.

వినియోగదారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై యూట్యూబ్ స్పందించింది. అయితే ఈ ఆరోపణలను యూట్యూబ్ ప్రతినిధి కొట్టి పడేశారు. ది వెర్జ్‌కి ఇచ్చిన నివేదికలో యూట్యూబ్ ప్రతినిధి.. స్కిప్పబుల్ యాడ్స్ ఇప్పటికీ స్కిప్ బటన్​ను కలిగి ఉన్నాయని తెలిపారు. యూట్యూబ్​లో స్కిప్ బటన్​ను తీసివేయట్లేదని ఆయన స్పష్టం చేశారు. వీడియో ప్లేయర్ అనుభవంలో కొన్ని అంశాలను ప్రదర్శించే విధానాన్ని యూట్యూబ్ సర్దుబాటు చేస్తోందని, తద్వారా యూజర్స్ 'క్లీనర్ ఎక్స్​పీరియన్స్ ద్వారా యాడ్​తో మరింత లోతుగా నిమగ్నమవ్వొచ్చు' అని అన్నారు.

న్యూ డిజైన్: యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని మార్పులు చేస్తోందని ఆయన తెలిపారు. ఇది వీడియోలను స్ట్రీమింగ్ చేసేటప్పుడు వినియోగదారులకు కొత్త అనుభూతిని అందిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో యూజర్స్ వీడియోస్​ను స్కిప్​ చేసేందుకు కౌంట్‌డౌన్ టైమర్‌కు బదులుగా ప్రోగ్రెస్ బార్‌ను చూస్తారని ఆయన అన్నారు. అంటే స్కిప్ బటన్ మునుపటిలా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అయితే దాని డిజైన్, లుక్ మారొచ్చు.

అంతుచిక్కని రైలు ప్రమాదాలు- మానవ తప్పిదమా?- లేకుంటే టెక్నాలజీ లోపమా?

కొత్త ప్రదేశానికి వెళ్తున్నారా?- ఈ యాప్​తో మీ ప్రయాణం చాలా ఈజీ బాస్..!

Last Updated : Oct 14, 2024, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.