ETV Bharat / technology

యూట్యూబ్​ నయా ఏఐ ఫీచర్స్​ - ఇకపై​ బోరింగ్ వీడియోలకు గుడ్​ బై! - YouTube AI Features - YOUTUBE AI FEATURES

YouTube AI Features : యూట్యూబ్​ యూజర్లకు గుడ్ న్యూస్​. త్వరలో 3 సరికొత్త ఏఐ-పవర్డ్​ ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు యూట్యూబ్​ సన్నాహాలు చేస్తోంది. ఇవే కనుక అందుబాటులోకి వస్తే బోరింగ్​, లెంగ్తీ వీడియోలు కూడా సూపర్ ఫన్​గా మారిపోతాయి.

Youtube AI video navigation tool
YouTube AI Features
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 3:14 PM IST

YouTube AI Features : ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్​ఫాం యూట్యూబ్ త్వరలో​ 3 సరికొత్త ఏఐ-పవర్డ్​ ఫీచర్లను అందుబాటులోకి తేనుంది. వీటి ద్వారా పెద్దపెద్ద వీడియోలను సులువుగా నావిగేట్ చేయడానికి, కామెంట్స్​ సమ్మరైజ్​ చేసుకోవడానికి వీలవుతుంది. అంతేకాదు ఎడ్యుకేషన్ వీడియోస్​లో నేరుగా ప్రశ్నలు అడగడానికి, సమాధానాలు రాబట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. మరెందుకు ఆలస్యం ఆ నయా ఫీచర్లపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.

AI Video Navigation Tool : పెద్దపెద్ద వీడియోలను పూర్తిగా చూడడం చాలా బోరింగ్​గా ఉంటుంది. అందుకే యూట్యూబ్​ కొత్తగా ఏఐ వీడియో నావిగేషన్ టూల్​ను తెచ్చింది. దీని ద్వారా ఒక వీడియోలోని మంచి ఇంట్రెస్టింగ్​ పాయింట్​ వద్దకు లేదా సెగ్మెంట్​ వద్దకు నేరుగా వెళ్లవచ్చు. ఇందుకోసం మీరు వీడియోపై రెండు సార్లు నొక్కాలి. వెంటనే మీకొక బటన్​ కనిపిస్తుంది. దానిని ట్యాప్ చేయగానే సదరు వీడియోలోని మంచి ఇంట్రెస్టింగ్​ సెగ్మెంట్​లోకి మనం వెళ్లిపోతాయి.

ప్రస్తుతం ఈ ఏఐ ఫీచర్​ అమెరికాలోని కొంత మంది ప్రీమియం సబ్​స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో దీనిని మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

AI Categorized Comments : పెద్ద వీడియోల్లో చాలా టాపిక్స్ ఉంటాయి. కనుక వాటి కింద బోలెడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ కామెంట్స్​ అన్నింటినీ టాపిక్ వైజ్​గా సార్ట్​ (Sort) చేసుకోవచ్చు. అంటే అంశాల వారీగా క్రమబద్ధీకరించుకోవచ్చు.

ఈ నయా ఏఐ ఫీచర్ వల్ల యూజర్లకు నచ్చిన కంటెంట్ గురించి క్రియేటర్లు తెలుసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఫీడ్ బ్యాక్ ద్వారా యూజర్లకు నచ్చిన వీడియోలను చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే నెగిటివ్​ కామెంట్స్​ను, వీడియోలోని అనవరసమైన భాగాలను తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది.

AI Ask Button : యూట్యూబ్​ 'ఎడ్యుకేషనల్​ వీడియో'ల కోసం Ask అనే సరికొత్త ఏఐ బటన్​ను తీసుకువచ్చారు. దీనితో వీడియోను ఆపకుండానే, నేరుగా ఎడ్యుకేటర్​తో ఇంటరాక్ట్ కావచ్చు. ఎలా అంటే, మీరు 'ఆస్క్' బటన్​పై క్లిక్ చేసి ప్రశ్నలు వేయవచ్చు. సమాధానాలు చెప్పవచ్చు. కంటెంట్ క్రియేటర్లు క్విజ్​ నిర్వహించుకోవచ్చు. కంటెంట్ రికమండేషన్స్ కూడా చేయవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ మూడు ఏఐ ఫీచర్లు కొంత మంది ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే వీటిని మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

OpenAI న్యూ 'వాయిస్​ క్లోనింగ్​ టెక్నాలజీ' - రిలీజ్ చేస్తే రిస్కే! - OpenAI Voice Engine

డేటా బ్యాకప్​తో ఎన్నో లాభాలు- ఎప్పుడైనా ఎక్కడైనా ఈజీగా యాక్సెస్​- చోరీ అయినా సేఫే! - World Backup Day 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.