Apple iPhone 16 Ban: టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి ఇండోనేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఐఫోన్ల సేల్స్‌ను పూర్తిగా బ్యాన్ చేసింది. అందులో ముఖ్యంగా యాపిల్ ఇటీవల తీసుకొచ్చిన ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై నిషేధం విధించింది. విదేశాల నుంచి యాపిల్ ఫోన్లను కొనుగోలు చేయకూడని వినియోగదారులను కూడా హెచ్చరించింది. అలా కాకుండా ఎవరైనా ఈ మోడల్ ఐఫోన్లను వినియోగిస్తే చట్టవిరుద్ధమని అని ఇండోనేషియా పరిశ్రమల మంత్రి అగస్ గుమివాంగ్ కర్తాసస్మిత ప్రకటించారు.
"ఇండోనేషియాలో ఎవరైనా iPhone 16ని తీసుకువస్తే అది చట్టవిరుద్ధం. విదేశాల నుంచి యాపిల్ ఫోన్లను కొనుగోలు చేయకూడదు. ఇండోనేషియాలో ఐఫోన్ 16 సేల్స్ కోసం అంతర్జాతీయ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (IMEI) సర్టిఫికేషన్ జారీ చేయలేదు." - అగస్ గుమివాంగ్ కర్తాసస్మిత, ఇండోనేషియా పరిశ్రమల మంత్రి
ఈ ఐఫోన్ల విక్రయాలపై ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (IMEI) సర్టిఫికేట్ ఇవ్వలేదని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇండోనేషియాలోని అనేక టాప్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఇవి అందుబాటులో లేవు. అంతేకాక కంపెనీ ఇటీవల తీసుకొచ్చిన ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్, లేటెస్ట్ లైనప్‌లోని ఇతర మోడల్స్ యాపిల్ అధికారిక వెబ్సైట్లో కూడా ఆ దేశంలో విక్రయించడం లేదు.
ఇండోనేషియా ఎందుకు ఐఫోన్ 16 బ్యాన్ చేసింది?: స్థానిక మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. యాపిల్ ఇండోనేషియాలో 1.71 ట్రిలియన్ రూపాయల ($109 మిలియన్లు) పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతానికి 1.48 ట్రిలియన్ రూపాయలు ($ 95 మిలియన్లు) పెట్టుబడి మాత్రమే పెట్టింది. దీంతో రూ. 230 బిలియన్ల (14.75 మిలియన్ డాలర్లు) కొరత ఏర్పడింది. దీంతో TKDN (డొమెస్టిక్ కాంపోనెంట్ లెవెల్) సర్టిఫికేషన్ జారీపై ప్రభావం పడుతుంది.
ఇండోనేషియాలో ఐఫోన్ 16 విక్రయానికి అవసరమైన అనుమతులను జారీ చేయకపోవడానికి ఇదే కారణమని మంత్రి చెప్పారు. ఈ సర్టిఫికేట్ జారీ చేయాలంటే ఇండోనేషియాలో విక్రయించే విదేశీ డివైజ్‌లపై 40 శాతం స్థానికంగా తయారీ చేయటం తప్పనిసరి.
ఈ పండక్కి కొత్త ఫోన్ కొనాలా?- అది కూడా తక్కువ ధరలో..?- అయితే ఒప్పో A3x 4Gపై ఓ లుక్కేయండి!