WhatsApp Search By Date Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తెస్తూ ఉంటుంది. అందులో భాగంగా 'సెర్చ్ బై డేట్' అనే సరికొత్త ఫీచర్‌ను క్రమంగా రోల్అవుట్ చేస్తోంది.
ఈ 'సెర్చ్ బై డేట్' ఫీచర్ ద్వారా మీకు కావాల్సిన నిర్దిష్ట తేదీలోని మెసేజ్‌లను, మీడియా ఫైల్స్‌ను సులువుగా చూడవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ డివైజ్‌లతోపాటు ఐఓఎస్, మ్యాక్, వాట్సాప్ వెబ్ల్లోనూ పనిచేస్తుంది.
లిమిటేషన్
ఈ సెర్చ్ బై డేట్ ఫీచర్ ఉపయోగిస్తే, మీరు కోరుకున్న తేదీలోని చాట్లు అన్నీ కనిపిస్తాయి. అలాకాకుండా, ప్రత్యేకంగా మీకు కావాల్సిన చాట్‌ను మాత్రమే సెర్చ్ చేద్దామంటే కుదరదు.
సెర్చ్ బై డేట్ ఫీచర్‌ను ఎలా వాడాలి?
- ముందుగా మీరు వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి.
- మీ పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేయాలి.
- ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్లి సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీకు క్యాలెండర్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయాలి.
- క్యాలెండర్లో మీకు కావాల్సిన తేదీని ఎంచుకోవాలి.
- వెంటనే సదరు తేదీలో మీరు చేసిన చాట్స్, మీడియా ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి.
వాట్సాప్ టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్
వాట్సాప్ తమ యూజర్ల కోసం ఇటీవలే టెక్ట్స్ ఫార్మాటింగ్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనిని ఉపయోగించి మీరు టెక్ట్స్‌ను అందంగా మార్చుకోవచ్చు.
- ఒక వేళ మీరు పంపించాలనుకున్న టెక్ట్స్‌లో ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని బుల్లెట్స్ రూపంలో అందించాలనుకుంటే ఆ వాక్యం ముందు '-' టైప్ చేయాలి.
- కంప్యూటర్లో Shift + Enter ను టైప్ చేస్తే తర్వాత వాక్యానికి కూడా బుల్లెట్ పాయింట్ వచ్చేస్తుంది.
- ఒక వేళ మీకు నంబర్డ్ లిస్ట్ కావాలనుకుంటే టెక్ట్స్ ముందు '1, 2, 3' ఇలా అంకెలను టైప్ చేయాలి. ఇది కూడా బుల్లెట్ పాయింట్స్ మాదిరిగానే పని చేస్తుంది.
- సుదీర్ఘమైన టెక్ట్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్లను హైలైట్ చేసేందుకు ఆ వాక్యాల ముందు '>' ని టైప్ చేయాలి. ఇదే బ్లాక్ కోట్.
- బ్యాక్‌గ్రౌండ్‌తో సహా వాక్యాన్ని హైలైట్ చేసేందుకు ఇన్‌లైన్ కోడ్ చిహ్నాల ``మధ్యన పదాలు ఉంచాలి.
వాట్సప్ యూజర్ల కోసం తీసుకొచ్చిన ఈ ఆప్షన్లను ఆండ్రాయిడ్, ఐఫోన్, వెబ్‌తో పాటు మ్యాక్ డెస్క్‌టాప్‌లో కూడా వినియోగించుకోవచ్చు. పర్సనల్, గ్రూప్ చాట్‌లకే కాకుండా ఛానల్ అడ్మిన్‌లు సైతం ఈ ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు.
వాట్సాప్ హెల్ప్‌లైన్
నేడు డీప్‌ఫేక్ ఫొటోల, వీడియోల బెడద, తప్పుడు సమాచారాల విస్తృతి విపరీతంగా పెరుగుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ, డీప్‌ఫేక్ టెక్నాలజీలతో రూపొందిస్తున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు, వాట్సప్‌లో ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
ఈ ఫ్యాక్ట్ చెక్ హెల్ప్‌లైన్ ద్వారా డీప్‌ఫేక్ చిత్రాలను, వీడియోలను సులభంగా గుర్తించడానికి వీలవుతుందని మెటా సంస్థ పేర్కొంది. ఇందుకోసం 'మిస్‌ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్' (MCA)తో టై-అప్ అయినట్లు వెల్లడించింది. 2024 మార్చిలో ఈ హెల్ప్‌లైన్ వాట్సాప్ యూజర్లు అందరికీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది.
గూగుల్‌లో బెస్ట్ రిజల్ట్స్ రావాలా? ఈ టాప్-10 సెర్చ్ ట్రిక్స్ మీ కోసమే!