ETV Bharat / technology

బిగ్ అలర్ట్ : మీ స్మార్ట్​ఫోన్​లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? - అయితే, పేలడం గ్యారెంటీ! - Warning Signs Of Mobile Explosion

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 4:45 PM IST

Early Signs Of Smartphone Explosion : ప్రస్తుత రోజుల్లో మొబైల్​ ఫోన్లు పేలిన ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే, స్మార్ట్​ఫోన్స్ పేలే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

MOBILE EXPLOSION WARNING SIGNS
Early Signs Of Smartphone Explosion (ETV Bharat)

These Signs Indicate Smartphone Explosion : నేటి టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్​ఫోన్​ను తమ ఆత్మీయ తోడుగా మార్చుకున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్​ను విపరీతంగా వాడేస్తున్నారు. అయితే స్మార్ట్​ఫోన్​ వినియోగం వల్ల ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా మొబైల్ అతి వినియోగం వల్ల బ్యాటరీ వేడెక్కి.. స్మార్ట్​ఫోన్ పేలిన ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అందుకే స్మార్ట్​ఫోన్​ను(Smart Phone) యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఫోన్​ పేలే ముందు పలు సంకేతాలు కనిపిస్తాయంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • స్మార్ట్​ఫోన్ పేలుడు సంభవించడానికి అత్యంత ముఖ్య కారణం.. బ్యాటరీ లోపం. ఎందుకంటే.. అవి లిథియం అయాన్​తో తయారవుతాయి. అయితే బ్యాటరీలో ఏదైనా లోపం తలెత్తి.. దాని కారణంగా ఉబ్బినట్లు కనిపిస్తే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అది అసాధారణంగా ఉబ్బితే మొబైల్ పేలిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. కాబట్టి, బ్యాటరీ ఉబ్బితే వెంటనే మార్చుకోవాలని సూచిస్తున్నారు.
  • అలాగే.. మీ మొబైల్ తరచుగా హీటెక్కుతుంటే జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. అది ఫోన్‌లోని బ్యాటరీ, ఇతర భాగాలలో సమస్యకు సంకేతం కావొచ్చంటున్నారు. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో మొబైల్ హీట్ కావడం వల్ల బ్యాటరీ వేడెక్కడం లేదా షార్ట్ సర్క్యూట్ కావచ్చని చెబుతున్నారు. దీని కారణంగా ఫోన్‌లో మంటలు లేదా పేలిపోయే ఛాన్స్ పెరుగుతుందని సూచిస్తున్నారు. కాబట్టి, అలాంటి సందర్భాలలో వెంటనే సర్వీస్ సెంటర్​కు వెళ్లి మొబైల్​ను చెక్ చేయించుకోవాలంటున్నారు.

అలర్ట్ : మొబైల్ పక్కనే పెట్టుకొని నిద్రిస్తున్నారా? - మీకు ఏం జరుగుతుందో తెలుసుకోండి!

  • మనం కొన్నిసార్లు సూర్యరశ్మి తగిలే చోటులో ఫోన్‌ ఉంచి ఛార్జ్‌ చేస్తుంటాం. దానివల్ల మొబైల్ వేడెక్కె ప్రమాదం ఉంది. నార్మల్​గా ఫోన్ ఛార్జ్‌ చేస్తున్నప్పుడు కొంత వేడిగా ఉంటుంది. అలాంటి సమయంలో సూర్యుడి నుంచి వచ్చే కాంతి వల్ల ఫోన్ మరింత వేడెక్కుతుంది. దీని కారణంగా బ్యాటరీ వేడెక్కి ఫోన్​ పేలే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, ఎప్పుడూ టెంపరేచర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మొబైల్ ఛార్జింగ్ పెట్టకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
  • 2019లో 'Journal of Power Sources'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక ఉష్ణోగ్రత వద్ద ఫోన్​ ఛార్జింగ్ ​పెట్టినప్పుడు.. లిథియం అయాన్ బ్యాటరీలు కేవలం 30 నిమిషాలలో పేలే ప్రమాదం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్​ డాక్టర్ టాకెషి హమామోటో పాల్గొన్నారు. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బ్యాటరీ పేలే ప్రమాదం కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
  • కొందరు అనుకోకుండా ఫోన్‌ పగిలినా, చిన్న డ్యామేజ్‌ అయినా... రిపేర్‌ చేయించకుండా అలానే వాడేస్తుంటారు. అయితే, ఇది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. డ్యామేజ్‌ అయిన స్మార్ట్‌ఫోన్లు వేగంగా వేడెక్కి, పేలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి, వీలైనంత త్వరగా రిపేర్‌ చేయించుకున్నాకే వాడడం మంచిదని సూచిస్తున్నారు.
  • అదేవిధంగా నకిలీ ఛార్జర్లు, బ్యాటరీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే.. నకిలీ ఛార్జర్లను యూజ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ వేడెక్కి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. అలాగే.. నకిలీ బ్యాటరీలు లేదా తక్కువ ధరకు లభించే బ్యాటరీలు సరైన ప్రమాణాలు పాటించకపోవచ్చు. దీని కారణంగా బ్యాటరీ త్వరగా వేడెక్కి మంటలు చెలరేగవచ్చని సూచిస్తున్నారు. అందుకే కంపెనీ సూచించిన వాటిని ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.

వాష్​రూమ్​లోకి ఫోన్​ పట్టుకెళ్తున్నవా? - ఒక్కసారి ఆగు - ఈ డాక్టర్ సాబ్​ ఏం చెబుతున్నారో విను!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.