ETV Bharat / technology

I'm not a robot గురించి తెలుసా? అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! - Shocking Facts About Captcha System - SHOCKING FACTS ABOUT CAPTCHA SYSTEM

Shocking Facts About I'm Not A Robot Captcha : మనం ఏదైనా వెబ్​సైట్​ ఓపెన్ చేయగానే 'క్యాప్చా' ఎంటర్ చేయమనో, లేదా 'ఐయామ్ నాట్ ఏ రోబోట్'​ చెక్​ బాక్స్​పై క్లిక్ చేయమనో సందేశం ఉంటుంది. మరి దీనిపై క్లిక్ చేస్తే ఏమౌతుంది? దీని మెకానిజం ఎలా ఉంటుంది? తెలిస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ!

CAPTCHA
I'm not a robot (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 3:38 PM IST

Shocking Facts About I'm Not A Robot Captcha : వెబ్​సైట్స్​ ఓపెన్ చేసేటప్పుడు "నేను రోబోట్​ కాదు" (I'm not a robot) అనే చెక్ బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. సింపుల్​గా దానిపై క్లిక్ చేసి, మన పని మనం చేసుకుంటూపోతాం. అయితే ఈ చెక్​ బాక్స్​పై క్లిక్ చేస్తే, అసలు ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వేళ మీకు ఈ విషయం తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం.

'ఐయామ్ నాట్ ఏ రోబోట్' అనే చెక్ బాక్స్ మామూలుది కాదు. ఇది మనం ఊహించిన దానికంటే చాలా తెలివైనది. సంక్లిష్టమైనది కూడా.

ఇది ఎలా పనిచేస్తుందంటే?
'ఐయామ్ నాట్ ఏ రోబోట్' అనేది క్యాప్చా (CAPTCHA) అని పిలవబడే సిస్టమ్​లోని ఓ భాగం. 'ఆటోమేటెడ్ బాట్​లు, మనుషుల మధ్య తేడాను గుర్తించేందుకు ఆటోమేటిక్​గా జరిగే పబ్లిక్ టూరింగ్ టెస్ట్​' ఇది. దీని మెకానిజం చాలా సంక్లిష్టంగా ఉంటుంది.

హిస్టరీ చెక్ చేయడం ద్వారా!
'ఐయామ్ నాట్ ఓ రోబోట్' చెక్​బాక్స్​ను క్లిక్ చేయగానే, అది మీ గురించి ఆరా తీస్తుంది. అంటే అంతకు ముందు మీరు ఇంటర్నెట్​లో ఏమేమి చేశారో పరిశీలిస్తుంది.

కాస్త వివరంగా చెప్పాలంటే, 'క్యాప్చా సిస్టమ్' అనేది మీరు ఇంటర్నెట్​లో ఏమేమి వెతికారో, ఏమేమి చేశారో పూర్తిగా విశ్లేషిస్తుంది. సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే మీ 'డిజిటల్ ఫుట్​ప్రింట్​'ను చూస్తుంది. దీని ద్వారా ఆటోమేటెడ్ బాట్​ (bot), మనుషుల మధ్య తేడా గుర్తిస్తుంది. దీనిని కాస్త సులభంగా చెప్పాలంటే, మీరు నిజమైన వ్యక్తా, కాదా అనేది నిర్ణయించడానికి, మీ బ్రౌజింగ్ హిస్టరీని చూస్తుంది. కనుక మీరు క్యాప్చా ఎంటర్​ చేసినా, లేదా చెక్​ బాక్స్​పై క్లిక్ చేసినా, అది క్షణాల్లో మీ ప్రవర్తనను కూడా అంచనా వేస్తుంది.

నిజం చెప్పాలంటే, ఈ క్యాప్చా సిస్టమ్ ఇంకా చాలానే చేస్తుంది. చెక్​ బాక్స్​పై క్లిక్ చేసిన వెంటనే, అది మీ గురించి తనిఖీ చేయమని వెబ్​సైట్​ను ప్రేరేపిస్తుంది. వెంటనే సదరు వెబ్​సైట్ మీ బ్రౌజింగ్ హిస్టరీని పూర్తిగా విశ్లేషిస్తుంది.

ఉదాహరణకు, మీరు యూట్యూబ్​లో ప్రభాస్​ వీడియోలు చూశారు. ఎలాన్ మస్క్ పెట్టిన ఓ ట్వీట్​ను లైక్ చేశారు. తరువాత మీ మెయిల్​ చెక్ చేశారు అనుకుందాం. ఆ తరువాత మీరు ఏదైనా వెబ్​సైట్​లోకి వెళ్లి క్యాప్చా ఎంటర్ చేయడం లేదా 'ఐయామ్ నాట్ ఏ రోబోట్'​ చెక్​ బాక్స్​పై క్లిక్ చేశారు అనుకుందాం. అప్పుడు అది ఇంతకు ముందటి మీ బ్రౌజింగ్ హిస్టరీని అనలైజ్ చేసి, మీరు మనిషా లేదా ఆటోమేటెడ్ బాట్​ అనేది నిర్ధరణ చేసుకుంటుంది.

మౌస్ కదలికల ఆధారంగా!
'ఐయామ్ నాట్ ఏ రోబోట్​' విశ్లేషణ ఇక్కడితో ముగియదు. ఈ క్యాప్చా సిస్టమ్ అనేది మీరు మౌస్​ను ఎలా కదిలిస్తున్నారు అనేది కూడా పరిశీలస్తుంది. మేరు ఎంత వేగంగా, ఈ దిశలో మౌస్​ను కదిలిస్తున్నారో చూస్తుంది. అంతేకాదు మీ చేతులతో చేసే కదలికలను కూడా విశ్లేషిస్తుంది. అప్పటికీ మీరు మనిషా, కదా అనేది తేల్చుకోలేకపోతే, వెంటనే సెకండరీ టెస్ట్ చేస్తుంది.

ఎలా అంటే, 'ఐయామ్ నాట్ ఏ రోబోట్​' చెక్​ బాక్స్ కింద ఒక ఇమేజ్​ పత్యక్షమవుతుంది. అది చాలా బాక్స్​లతో ఉంటుంది. దీనినే ఇమేజ్ రికగ్నిషన్ టెస్ట్ అంటారు. మీకు ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం, మీరు సరైన బాక్స్​లను క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు మనిషా, కాదా అనేది నిర్ధరణ చేస్తుంది.

ఇబ్బందికరమే - కానీ!
ఈ క్యాప్చా సిస్టమ్ అనేది చాలా ఇబ్బందికరమైనదే. కానీ వెబ్​సైట్​లకు హాని కలిగించే 'బాట్'లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, స్పామ్​లను అడ్డుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి అవుతోంది.​

ప్రైవసీ సంగతేంటి?
క్యాప్చా సిస్టమ్ అనేది యూజర్ల ప్రైవసీని దెబ్బతీస్తుందని కొంత మంది వాదన. కానీ ఇది చెడ్ బాట్​లను అడ్డుకోవడానికి తప్పనిసరి. మరి మీరేమంటారు?

మీకు మొబైల్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమా? ఈ టాప్​-7 ఫోన్లపై ఓ లుక్కేయండి! - The Best Camera Phone 2024

జియో నుంచి 2 కొత్త​ సర్వీసులు - 'సేఫ్‌ & ట్రాన్స్‌లేట్‌' - ఆ యూజర్లకు మాత్రం ఫ్రీ! - JIO Safe and JIO Translate

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.