ETV Bharat / technology

ఓపెన్ ఏఐ నుంచి మరో అద్భుతం..?- క్లారిటీ వచ్చిందిగా..! - NEXT GENERATION OF GPT 4 AI

ఓపెన్ ఏఐ నెక్ట్స్​ జెన్ GPT 4 AI లాంచ్​పై క్లారిటీ- ఎప్పుడంటే?

Next Generation of GPT 4 AI
Next Generation of GPT 4 AI (IANS)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 28, 2024, 11:08 AM IST

Updated : Oct 28, 2024, 12:00 PM IST

Next Generation of GPT 4 AI: ఏఐ ఆధారిత చాట్ జీపీటీని లాంచ్ చేసిన తర్వాత ఓపెన్ ఏఐ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ నుంచి రాబోతున్న తదుపరి తరం GPT-4 AI మోడల్ రిలీజ్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ తరుణంలో కంపెనీ తన తదుపరి తరం GPT-4 AI మోడల్​ను రిలీజ్ చేయట్లేదని స్పష్టం చేస్తూ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఓరియన్ అనే కోడ్‌నేమ్‌తో కూడిన AI మోడల్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేయడం లేదని సంస్థకు చెందిన ఓ ప్రతినిధి వెల్లడించారు.

"ఈ ఏడాది ఓరియన్ కోడ్‌నేమ్‌తో ప్రోటోటైప్‌ను రిలీజ్ చేయడానికి మేం ప్లాన్ చేయట్లేదు. వేరే ఇతర టెక్నాలజీలను తీసుకురావడంపై దృష్టి పెట్టాం." - ఓపెన్​ఏఐ కంపెనీ ప్రతినిధి

కాగా ఓపెన్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని యోచిస్తున్నట్లు ఇటీవల కొన్ని నివేదికలు వెల్లడించాయి. దీంతో ఈ వార్త సర్వత్రా సంచలనం సృష్టించింది. అయితే ఈ నివేదికలను కంపెనీ కొట్టిపారేసింది. ది వెర్జ్ నివేదిక ప్రకారం.. GPT-4 AI మోడల్ కంటే OpenAI నెక్స్ట్​ మోడల్ మరింత శక్తివంతమైన, సామర్థ్యం కలిగి ఉంటుందని వెల్లడించింది. కంపెనీ దీన్ని డిసెంబర్​లో తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్​కు ఇంటర్నల్​గా​ ఓరియన్ అని పేరు పెట్టారు. దీనిని మొదట్లో స్ట్రాబెర్రీ అని పిలిచేవారు. ఆ తర్వాత ఇది GPT-4o AI మోడల్‌గా మారింది.

ఓపెన్‌ఏఐ దీన్ని పబ్లిక్ డొమైన్‌లోకి విడుదల చేసే ముందు దానితో సన్నిహితంగా పనిచేసే సంస్థలకు అందుబాటులో ఉంచనుంది. కంపెనీ తన తదుపరి తరం ఫ్రాంటియర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను డిసెంబర్ 2024లోగా ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకుంది. GPT-4 రిలీజ్​ తర్వాత OpenAI.. GPT-4 టర్బో, GPT-4o AI మోడల్స్​ను రిలీజ్ చేసింది. కానీ వీటిలో ఏవీ కొత్త AI మోడల్స్ కాదు. అవి GPT-4 ఆర్కిటెక్చర్ ఫౌండేషన్​పై బిల్డ్ చేసిన LLM మోడిఫైడ్, అప్​డేటెడ్ వెర్షన్స్. AI మోడల్ నెక్ట్స్ వెర్షన్​ GPT-5.. న్యూ ఆర్కిటెక్చర్, కాపబిలిటీస్​తో వస్తుందని అంతా భావిస్తున్నారు.

7 నెలల తర్వాత భూమికి చేరిన వ్యోమగాములు- సక్సెస్​ఫుల్​గా స్పేస్‌ఎక్స్ క్రూ-8 మిషన్ కంప్లీట్!

ఫొటోస్​ను గుర్తించే కొత్త ఫీచర్​- ఇకపై ఫేక్ చిత్రాలను గుర్తుపట్టడం ఈజీ- అదెలాగంటే?

Last Updated : Oct 28, 2024, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.