Tecno Phantom Ultimate 2: టెక్ మార్కెట్లో రాణించాలంటే కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్‌ను విడుదల చేయాలి. దీంతో ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ కొత్త తరహా మొబైల్స్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు టెక్ మార్కెట్‌కు పరిచయం లేని ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. IFA బెర్లిన్‌లో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఈవెంట్లో టెక్నో ట్రై ఫోల్డ్ హ్యాండ్ సెట్ ఫస్ట్ లుక్‌ను ప్రదర్శించింది.
'టెక్నో ఫాంటమ్ అల్టిమేట్ 2' పేరుతో ఈ మొబైల్‌ను తీసుకురానున్నట్లు పేర్కొంది. మూడు మడతలు పెట్టేలా దీన్ని రూపొందించనున్నారు. కొత్త ఫోన్‌కు సబంధించిన ఫొటోలను టెక్నో సమాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పంచుకుంది. ఈ ఫోన్‌ను ల్యాప్‌లాప్‌గా ఉపయోగించుకోవచ్చని, ఒక ఫోల్డ్‌ని కీ బోర్డ్‌లా మార్చుకోవచ్చని తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఎదురుగా కూర్చున్నప్పుడు కంటెంట్‌ను వీక్షించేందుకు సాధ్యపడుతుంది.
'టెక్నో ఫాంటమ్ అల్టిమేట్ 2' ఫోన్ ఫీచర్స్: ఈ కింది ఫీచర్లతో ఈ మొబైల్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.
- 3 ఫోల్డబుల్ స్క్రీన్స్
- 6.48 అంగుళాల కవర్ డిస్‌ప్లే
- 10 అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ ఇన్నర్ స్క్రీన్
- 1620 x 2880 పిక్సల్ రిజల్యూషన్
- టచ్ అండ్ డిస్‌ప్లే డైవర్జ్ ఇంటిగ్రేషన్(TDDI) టెక్నాలజీ
- డిస్‌ప్లే డ్రైవర్, టచ్ సెన్సార్
- 11ఎమ్ఎమ్ థిక్నెస్
- డ్యూయల్ హింజ్ మెకానిజమ్
- అల్ట్రా స్లిమ్ బ్యాటరీ
- 4:3 ఆస్పెక్ట్ రేషియో
Tecno Phantom Ultimate 2, a tri-fold concept phone has been announced.
— Anvin (@ZionsAnvin) August 28, 2024
- 6.48-inch main display when closed.
- Expands to a 10-inch 3K OLED panel with a 4:3 aspect ratio when unfolded.
- Measures just 11mm thick when folded, thinner than the Galaxy Z Fold 6 (12.1mm).
- Supports… pic.twitter.com/aLTJAmrbOP
3లక్షల సార్లు టెస్ట్‌లు:
- 'టెక్నో ఫాంటమ్ అల్టిమేట్ 2' ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ హింజ్ మెకానిజంను కలిగి ఉంది.
- దీని బ్యాటరీ మందం కేవలం 0.25ఎంఎం మాత్రమే ఉంటుంది.
- ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ట్రై ఫోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉన్నా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ మొబైల్స్ తరహా థిక్నెస్నే కలిగి ఉంది.
- ఈ ఫీచర్లతో మార్కెట్లోకి రానున్న తొలి ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ఇదే అని టెక్నో సంస్థ చెబుతోంది.
- 3లక్షల సార్లు ఈ మొబైల్‌కు ఫోల్డ్, అన్‌ఫోల్డ్ టెస్ట్‌లు నిర్వహించినట్లు పేర్కొంది.
టెక్నో ట్రై ఫోల్డ్ మొబైల్ లాంఛ్ ఎప్పుడు?
- టెక్నో సంస్థ తొలిసారిగా ఈ కాన్సెప్ట్‌ను ఫిబ్రవరిలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 (MWC 2024)లో విడుదల చేసింది.
- ప్రస్తుతం IFA బెర్లిన్‌లో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఈవెంట్లో దీని ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది.
- ఈ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌ను టెక్నో విడుదల చేసినా ఎప్పటి నుంచి దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది అనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.
- అయితే టెక్నో కంటే ముందే చైనాకి చెందిన హువావే(Huawei) ఈ తరహా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
- ఈ మేరకు Huawei అక్టోబర్‌లో ఇందుకు సంబంధించిన ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం.
శాంసంగ్ ఫోన్లపై అదిరే ఆఫర్స్- రూ.6వేల వరకు భారీ తగ్గింపు! - huge discounts on samsung phones
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్- యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్ - iphone 16 launch date