ETV Bharat / technology

భారీ మైలేజీతో 'నెక్సాన్‌ ఐసీఎన్‌జీ' లాంచ్- ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! - Tata Nexon iCNG Launched - TATA NEXON ICNG LAUNCHED

Tata Nexon iCNG Launched: వాహన ప్రియులకు శుభవార్త. పండగ వేళ మార్కెట్లోకి మరో కొత్త కారు వచ్చింది. అత్యాధునిక ఫీచర్లతో టాటా నుంచి నెక్సాన్‌ ఐసీఎన్‌జీ విడుదలైంది. ఈ సందర్భంగా దీని ధర, స్పెసిఫికేషన్లు వంటి వివరాలు మీకోసం.

Tata Nexon iCNG Launched
Tata Nexon iCNG Launched (tatamotorscars)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 24, 2024, 3:35 PM IST

Tata Nexon iCNG Launched: వాహన ప్రియులకు ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ గుడ్​న్యూస్ తెచ్చింది. తన నెక్సాన్‌ లైనప్‌లో కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో టాటా మోటార్స్ లాంచ్‌ చేసింది. ఇప్పటికే నెక్సాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌, ఈవీ వేరియంట్లు ఉండగా తాజాగా సీఎన్‌జీ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఇండియాలో టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన మొదటి సీఎన్‌జీ వాహనంగా ఈ కారు నిలిచింది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో నెక్సాన్‌ ఐసీఎన్‌జీ తీసుకొచ్చింది.

అత్యాధునిక ఫీచర్లతో డ్యూయల్ సిలిండర్ సదుపాయంతో దీన్ని విడుదల చేసింది. రెండు స్లిమ్‌ సిలిండర్లు ఉండడంతో కార్గో ఏరియా విశాలంగా ఉంటుందని టాటా మోటార్స్ తెలిపింది. సీఎన్​జీ మోడ్​లో ఇంధన సామర్థ్యం కిలోగ్రాముకు 24 కిలోమీటర్లు అని పేర్కొంది. 8 వేరియంట్స్​లో దీన్ని తీసుకొచ్చారు. దీని అన్ని వేరియంట్లలో కూడా 6 ఎయిర్‌ బ్యాగ్‌లు భద్రతా ఫీచర్లను జోడించినట్లు కంపెనీ చెబుతోంది. హారియర్‌, సఫారితో ఎంతో ఆదరణ పొందిన రెడ్‌ డార్క్‌ ఎడిషన్‌నూ దీంట్లో తీసుకొచ్చారు. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లు, ఇంజిన్​ వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.

టాటా నెక్సాన్‌ ఐసీఎన్‌జీ స్పెసిఫికేషన్స్:

10.25 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే

ఇంజిన్‌: 1.2 లీటర్ల టర్బో పెట్రోల్‌

టార్క్‌: 98 bhp, 170 Nm

6 ఎయిర్‌ బ్యాగ్‌లు

పనోరమిక్‌ సన్‌రూఫ్‌

360 డిగ్రీల కెమెరా

లెథర్‌ సీట్లు

నావిగేషన్‌ డిస్‌ప్లే

టాటా నెక్సాన్‌ ఐసీఎన్‌జీ వేరియంట్స్: ఎనిమిది వేరియంట్లతో టాటా నెక్సాన్‌ ఐసీఎన్‌జీ మార్కెట్లో లాంచ్ అయింది.

  • స్మార్ట్‌ (O)
  • స్మార్ట్‌ +
  • స్మార్ట్‌ + ఎస్‌
  • ప్యూర్‌
  • ప్యూర్‌ ఎస్‌
  • క్రియేటివ్‌
  • క్రియేటివ్‌ +
  • ఫియర్‌లెస్‌ + పీఎస్‌

ఇలా ఎనిమిది వేరియంట్లతో సౌకర్యవంతమైన ఫీచర్లతో టాటా నెక్సాన్‌ ఐసీఎన్‌జీ మార్కెట్లో అందుబాటులో ఉంది వచ్చింది. వీటిలో టాప్‌ వేరియంట్‌ అయిన ఫియర్‌లెస్‌ + పీఎన్‌ ధర రూ.14.50 లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌). అన్ని వేరియంట్లు 6 ఎయిర్‌ బ్యాగులతో వస్తున్నాయి.

టాటా నెక్సాన్‌ ఐసీఎన్‌జీ ధర: రూ.8.99 లక్షల నుంచి ప్రారంభం (ఎక్స్‌- షోరూమ్)

మారుతీ సుజుకీ సరికొత్త స్విఫ్ట్‌ లాంచ్- కిలో సీఎన్‌జీకి 32.85 కి.మీ మైలేజ్‌ - Maruti Suzuki Swift CNG Launched

ఎంజీ మూడో ఎలక్ట్రిక్ కారు లాంచ్- ఫీచర్స్ చూస్తే వావ్ 'విండ్సర్​' అనాల్సిందే! - New MG Windsor EV Launched

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.